Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
మండలంలోని ఏజెన్సీ గ్రామాలలో అకాల గాలి దుమారం వర్షాలతో మిర్చి తోట రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మొక్కజొన్న, వరి, అపరాల పంటలకు కూడా నష్టం వాటిల్లిందని మండల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రంతో పాటు, ఏజెన్సీలోని రామచంద్రాపురం, కంబా లపల్లి, పందిపంపుల, మిర్యాల పెంట, సాంబ తండా, వెంకటాపురం గ్రామాలలో తీవ్ర నష్టం వాటిల్లినట్టు రైతులు వాపోయారు. ఆకస్మిక వర్షాల తో రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు కళ్ళ ముందు అకాల వర్షాలు, గాలిదూమారంతో పంట దెబ్బతిని తీవ్ర నష్టం జరిగిందని రైతులు బోరున విలపిస్తున్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
అకాల వర్షంతో తడిసిన పంటలు
గూడూరు: ఉగాది పండుగ పర్వదినం రోజున అకాల వర్షంతో మండలంలోని రైతులు మోస్తరుగా పంట నష్టం వాటిల్లింది. మంగళవారం సాయంత్రం ఒకేసారి ఉరుములు మెరుపులు గాలిదుమారం వర్షం రావడంతో మండలంలోని సీతానాగారం రాళ్లవాగు తండా పలు తండాలలో వర్షం కురిసింది. ఆయా ప్రాంతాలలో రైతులు పండించిన మొక్కజొన్న. మిర్చి వరి పంటలు దెబ్బతిన్నటు తెలిపారు. మిర్చి ఆరబోసిన క్రమంలో వరు సగా అవకాశాలు రావడంతో మిర్చి పంట తడిసి నట్లు రాళ్లవాగు తండ కు చెందిన రైతులు వాపోతున్నారు. ఎండాకాలంలో గాలిదుమారంతో వర్షాలు రావడంతో రైతులకు అపార నష్టం వాటిల్లింది.