Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూర్ టౌన్
ప్రభుత్వ గురుకులాల్లో చేరి ప్రపంచ స్థాయి విద్యను అభ్యసించాలని తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి మాంకాలి గౌతం పిలుపునిచ్చారు. మంగళవారం మండలం లోని అమ్మపుర, జీకే తండ తదితర గ్రామాల్లో టీజీపీఏ మహబూబాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులు ప్రభుత్వ గురు కులాల్లో ఐదో తరగతి ప్రవేశం కోసం ప్రచారం నిర్వహించారు. టీజీపీఎ మండల కార్యదర్శి మలేపూల సైదులు ఆద్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో గురుకుల విద్యార్థులు ప్రఖ్యాత యూనివర్సిటీలతో పాటు ప్రపంచ దేశాలలో చదువుతూ ఉన్నత స్థానాలలో పదవులు సాధిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షులు జి.నారాయణ, కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి డొనుక దర్గయ్య, సంతోష్ గౌడు, బొమ్మగాని విజరు గౌడు,రవినాయక్ , టిజిపిఎ గ్రామా కమిటి సభ్యులు డి.యాకయ్య తదితరులు పాల్గొన్నారు.