Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాంచంద్రారెడ్డి
నవతెలంగాణ-హసన్పర్తి
పరిసరాల పరిశుభ్రతతోనే మెరుగైన సమాజమని హసన్పర్తి వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మారపల్లి రాంచంద్రారెడ్డి అన్నారు. హసన్పర్తి పెద్ద చెరువు కట్ట మినీ ట్యాంక్ బండ్పై హసన్పర్తి వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవుడు నివసించే ప్రాంతాలు, పరిసరాలు, గ్రామాలు శుభ్రంగా ఉంటేనే ప్రజల ఆరోగ్యం జీవన విధానంలో పురోగతి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఆకుతోట రమేష్, హౌప్ స్వచ్ఛంద సంస్థ ప్రధాన కార్యదర్శి గురుమూర్తి శివకుమార్, వినియోగదారుల ఫోరం మండల కన్వీనర్ అనుమాండ్ల విద్యాసాగర్, వడుప్సా నాయకులు ఆకుతోట రాంబాబు, వలస జ్ఞానేశ్వర్, వాకర్స్ వెంకటేశ్వర్లు, ఆరెల్లి వెంకటస్వామి, ఆరెల్లి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.