Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అవినీతి సామ్రాట్‌గా మూల మధూకర్‌రెడ్డి
- న్యూడెమోక్రసీపై ఆరోపణలకు ఖండన
నవతెలంగాణ-బయ్యారం
గత సంవత్సరం జరిగిన సొసైటీ ఎన్నికలలో చైర్మెన్‌గా బాధ్యతలు తీసుకున్న టీఆర్ఎస్ నాయకులు మూల మధుకర్ రెడ్డి సంవత్సరం తిరగకుండానే సొసైటీని భ్రష్టు పట్టిస్తూ అవినీతి మయం చేశాడని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఎస్డీఎల్సీ మండల కార్యదర్శి ఎస్.కె మదర్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రమాణం చేసిన రెండోరోజే ఇద్దరు సొసైటీ ఉద్యోగులను తొలగించారని, పాత సిబ్బందిని మార్చివేసి తన బావమరిదిని అర్హత లేకున్నా సీఈఓగా నియమించుకున్నాడన్నారు. ఎరువులు, విత్తనాలపై ఎమ్మార్పీ ధరల కంటే అధిక మొత్తాన్ని వసూలు చేయడం, లోన్ మంజూరులో అవకతవకలకు పాల్పడి లక్షల రూపాయలు కాజేయడం, హమాలీ వేతన ఒప్పందాన్ని అమలు చేయకుండా వారిని ఇబ్బంది పెట్టడం, ఎరువులను బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవడం, తమ ఏజెంట్లకు దొడ్డిదారిన సొసైటీ నుంచి జీతభత్యాలు ఇవ్వడం వంటి అనేక అవకతవకలకు పాల్పడ్డారని తెలిపారు. సొసైటీ నియమ నిబంధనలకు భిన్నంగా అంతా తానై వ్యవహరించారని, చివరికి ఎలాంటి కారణం లేకుం డా దళితుడైన రాజేష్‌ను కారణం చెప్పకుండా నోటి మాట చెప్పి పనిలో నుంచి తొలగించారన్నారు. వీటన్నిటిని ప్రశ్నించిన సొంత పార్టీకి చెందిన వైస్ చైర్మెన్ గంగుల సత్యనారాయణ పైన దాడి చేశారన్నారు. సొసైటీని అవినీతి మయం చేసి భ్రష్టు పట్టించిన మూల మధుకర్ రెడ్డి తన నేరాలను కప్పిపుచ్చుకోవడానికి సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ పైన, మాజీ జెడ్పీటీసీ గౌని ఐలయ్య పైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇ మధుకర్ రెడ్డి అవినీతి అవకతవకల పైన జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా నాయకులు పద్మ, నాయకులు తుడుం వీరభద్రం, మధంశెట్టి నాగేశ్వ రరావు, కొదుమూరి వీరభద్రం, బోనగిరి మధు, శేషు పాల్గొన్నారు.