Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను బహుజనుల దిక్సూచిగా అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు కంకణాల కవిరాజారావు అభివర్ణించారు. ఈనెల 14న అంబేద్కర్ 130వ జయంతిని వేడుకగా నిర్వహించాలని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. భావితరాలకు స్ఫూర్తినిచ్చి చరిత్రలో నిలిచిపోయిన మహనీయుడిగా అంబేద్కర్ను కీర్తించారు. కులమతాలకు అతీతంగా పౌరు లందరికీ హక్కులు కల్పించిన మార్గదర్శిగా కొనియాడారు. అంబేద్కర్ 1891లో ఏప్రిల్ 14న జన్మించారని పేర్కొన్నారు. నిచ్చెన మెట్ల వ్యవస్థలోని రుగ్మతలను పారద్రోలి సమసమాజ నిర్మాణం కోసం కృషి చేశాడని తెలిపారు. లండన్ విశ్వవిద్యాలయంలో ఎనిమి దేండ్ల పీహెచ్డీని మూడేండ్లలో పూర్తి చేసిన మేథావిగా వివరించారు. అనాగరికమైన వ్యవస్థను ధ్వంసం చేసి స్వేచ్ఛా, సమానత్వం, సోదరభావం పరిమళించే ఒక నవ నాగరిక సమాజాన్ని నిర్మించడం కోసమే అంబేద్కర్ పోరాటం సాగిందని పేర్కొన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.