Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాజిపేట
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను మరచి ప్రజలను మోసం చేస్తున్నాయని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి అన్నారు. కాజీపేట మీడియా పాయింట్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ గ్రేటర్ వరంగల్ ఎన్నికలను దష్టిలో ఉంచుకుని వరంగల్ నగరానికి విచ్చేసి పలు అభివద్ధి పనులకు శంకుస్థాపన చేశారని కానీ ఆరేండ్ల కాలంలో శంకుస్థాఫన చేసినా పూర్తి కాని పనులపై ఎందుకు సమీక్ష చేయలేదని ప్రశ్నించారు. కేటీఆర్‌ను అడ్డుకోవడానికి ప్రయత్ని స్తున్నారనే ఆలోచనతో కాంగ్రెస్ నాయకులను, విద్యార్థి నాయకులను అర్ధరాత్రి వేళలో పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి జనగామ జిల్లా లింగాల గణపురం పోలీస్ స్టేషన్లు ఉంచడం సిగ్గుచేటన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి అభివద్ధి పనులకు శంకుస్థాపన చేస్తే ప్రజలే పట్టం కడతారని కానీ ప్రజలను మోసం చేస్తున్నారు కాబట్టి ఎన్నికలను దష్టిలో ఉంచుకొని కేటీఆర్ వచ్చినట్టు తెలి పారు. ప్రతి సంవత్సరం వరంగల్ నగర అభివద్ధికి మూడు వందల కోట్లు కేటాయిస్తున్నారని చెబుతున్నప్పటికీ నగరం లో ఏ ఒక్క చోట అభివద్ధి జరగలేదన్నారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గిరిజన యూనివర్శిటీ నేటికీ ప్రారంభం కాకపో వడానికి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రశ్నించే గొంతుగా ముందుంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చంద్రయ్య, మాజీ కార్పోరేటర్ జక్కుల రమ రవీందర్ యాదవ్, తొట్ల రాజు యాదవ్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ సయ్యద్ రజాలీ గుర్రపు కోటేశ్వర్, బోయిని కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.