Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సురేష్
నవతెలంగాణ-కాశిబుగ్గ
వరంగల్ ఫ్యూచర్ సిటీ. అంటే లోతట్టు ప్రాంత ప్రజలకు ఇచ్చిన హామీ లను విస్మరించి కేవలం జంక్షన్లలో సుందరీకరణ పనులు చేపట్టాడమేనా అని మంత్రి కేటీఆర్‌ను జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేష్ ప్రశ్నించారు. మంగళవారం వరంగల్ లక్ష్మీపురంలో శిథిలావస్థకు చేరి కూలిపోయిన యాదమ్మ ఇంటిని మంగళవారం సురేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అనాలోచిత నిర్ణయం వల్ల పేద ప్రజల బతుకులు రోడ్డున పడ్డాయని మండి పడ్డారు. లక్ష్మీపురంలో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ ఇంతవరకు ఎందుకు నెరవేర్చలేదన్నారు. తన దీన స్థితిని మంత్రి కేటీఆర్ దష్టికి తీసుకెళ్తామని ప్రయత్నించిన యాదమ్మపై పోలీసులచే దాడి చేయించడం హేయ మైనా చర్య అని మండిపడ్డారు. ఇందుకేనా పోట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుందని అన్నారు. కేవలం గ్రేటర్ వరంగల్ ఎన్నికల నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్ వరంగల్ లో పర్యటించి అనేక హామీలు ఇచ్చారన్నారు.