Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖానాపురం
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఆ గ్రామానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం కింద రూ. 10లక్షల నజరానా ప్రకటిస్తామని ప్రభుత్వం గ్రామపంచాయతీ ఎన్నికల వేల ప్రకటించింది. దీంతో పాటు పలువురు ఎమ్మెల్యేలు సైతం తమ నియోజకవర్గంలోని ఏకగ్రీవ పంచా యతీలకు రూ. 5 లక్షల నుంచి 10 లక్షల వరకు నజరా నా ప్రకటించారు. కానీ ఎన్నికలు పూర్తయ్యి రెండేండ్లు గడిచినా ఇంకా ఆ గ్రామ పంచాయతీలకు నిధులు అందలేదు. దీంతో అభివృద్ధికి నోచుకోకుండా కొట్టు మిట్టాడుతున్న పరిస్థితి నెలకొంది. ఖానాపురం మండలంలో మొత్తం 20 గ్రామ పంచాయతీలుండగా 11 గ్రామాల్లో సర్పంచ్ల ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఏకగ్రీవమైన గ్రామాల్లో రాగంపేట, కొత్తూరు, వేప చెట్టు తండా, మంగళ వారి పేట, బండ మీది మామిడి తండా, గొల్లగూడెం తండా, కోడ్తి మాట్ తండా, డబీర్ పేట్, చిలకమ్మ నగర్, బద్రు తండ, కీర్య తండా ఉన్నాయి. ప్రతి గ్రామానికి రూ. 10 లక్షల చొప్పున 1.10 కోట్ల నిధులు రావాల్సి ఉంది.
అందని ప్రోత్సాహకం..
ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకం ఏళ్ళు గడిచినా అందడం లేదు. ఎన్నికలు ఏకగ్రీవం అయితే ఖర్చు కలిసొస్తుందని భావించిన ప్రభుత్వం. ఆ దిశగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పది లక్షల నజ రానా ప్రకటించింది. 2019లో ఫిబ్రవరిలో పంచాయతీల్లో ఎన్నికలు జరిగినా ఇప్పటివరకు ఏకగ్రీవ పంచాయతీలకు చిల్లిగవ్వ ఇవ్వలేదు. దీంతో గ్రామాల అభివద్ధి కుంటుపడుతుంది. నిధుల రాక, ఇచ్చిన హామీలు నెరవేర్చలేక గ్రామా ల్లో తలెత్తుకుని తిరగలేక పోతున్నామని ఏకగ్రీవ గ్రామాల సర్పంచులు వాపో తున్నారు. గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం విడుదల చేసిన నిధులు కూడా అంతంత మాతం గానే ఉన్నాయి. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కింద వస్తున్న నిధులను ఒక నెల కేంద్రం, మరో నెల రాష్ట్రం విడుదల చేస్తున్నట్లు పంచాయతీ అధికారులు చెబుతున్నారు. ఇందులో మనిషికి 150 చొప్పున అందిస్తుంది. ఉదా హరణకు వెయ్యి జనాభా ఉన్న గ్రామ పంచాయతీకి 1.50 లక్షలు అందినట్టు లెక్క. జనరల్ ఫండ్ పేరుతో నల్లా కనెక్షన్, ఇంటి పన్ను, తదితర బిల్లులను వసూలు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. కానీ గ్రామాల్లో మాత్రం వసూలు కావడం చాలా అరుదు. అందుకే పంచా యతీలకు నిధుల కొరత ఏర్పడుతుంది. అనేక పంచాయతీలకు కనీసం విద్యుత్ బిల్లులు, కార్మికులకు వేతనాలు, చెత్త సేకరణ వాహనాల మెయిం టెనెన్స్, నర్సరీల నిర్వహణ ఖర్చు చెల్లించడానికి కూడా నిధులు లేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు అందించిన ప్రోత్సాహం అభివద్ధికి ఉపయోగకరంగా ఉంటుందని ఏకగ్రీవ సర్పంచులు వాపో తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పంచాయతీ ఎన్నికల సమయంలో ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు ప్రకటించిన నజరానా విడుదల చేయాలని కోరుతున్నారు.