Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్పంచ్ అహ్మద్ పాషా
నవతెలంగాణ-ములుగు
అధికారుల కృషి ఫలితంగానే పారిశుధ్యంలో జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని కాసిందేవిపేట సర్పంచ్ అహ్మద్ పాషా స్పష్టం చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని ప్రజల అవసరాలకు అనుగుణంగా గ్రామ పంచాయతీలను బలోపేతం చేయడంలో జిల్లా అధికార యంత్రాంగం సర్పంచ్లకు వెన్నంటి ఉండి అభివద్ధి, సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్తున్న క్రమంలోనే పారిశుధ్య నిర్వహణలో రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను జిల్లా కలెక్టర్ కష్ణ ఆదిత్య, అదనపు కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, డివిజనల్ పంచాయతీ అధికారి దేవరాజ్, మండల పంచాయతీ అధికారులు, గ్రామ కార్యదర్శులు సర్పంచ్లను ప్రోత్సహిస్తూ విశేష కృషి చేశారని తెలిపారు. ముఖ్యంగా గ్రామపంచాయతీల్లో పారిశుద్ధ్యం, తాగునీటి నిర్వహణతోపాటు వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డ్ల నిర్మాణం, ఉపాధి హామీ పనులు, ఇంటి పన్నులు వసూలుతోపాటు వివిధ అభివద్ధి, సంక్షేమ పథకాలు జిల్లాలో నూరు శాతం అమలు కావడంలో అధికారులు సర్పంచ్లను ముందుకు నడిపించడమే కారణమన్నారు. గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం అందిస్తున్న నిధులు సరైన సమయానికి అందనప్పటికీ సర్పంచ్లు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని అధికారుల ఆదేశాలను అమలు చేస్తూ గ్రామాల్లో ప్రజల అవసరాలు తీర్చారని చెప్పారు. తద్వారా గతంలో ఎన్నడూ లేనివిధంగా గ్రామ పంచాయతీలను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో అధికారులు, సర్పంచ్లు గ్రామాల అభివద్ధిని నిరాటంకంగా కొనసాగిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కూడా గ్రామాల అభివద్ధిని దష్టిలో పెట్టుకొని సర్పంచ్ల ఇబ్బందులను అర్ధం చేసుకుని సకాలంలో నిధులు అందించాలని కోరారు. పారిశుద్ధ్యంలో రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానంలో నిలిచినందుకు జిల్లా యంత్రాంగానికి, ముఖ్యంగా జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి, డివిజనల్ పంచాయతీ అధికారి, మండల పంచాయతీ అధికారులకు, పంచాయతీ కార్యదర్శులకు కాసీందేవిపేట సర్పంచ్ అహ్మద్ పాషా కృతజ్ఞతలకు తెలిపారు.