Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'డాటర్ ఇండియా' సినిమా షూటింగ్
- ఆడబిడ్డలు ఎందులోనూ తీసిపోరన్న ఇతివృత్తంతో.. : దర్శకుడు
నవతెలంగాణ-తొర్రూరు
తొర్రూరు డివిజన్ కేంద్రంలో మంగళ వారం ఆడబిడ్డల ప్రాధాన్యత తెలిపే 'డాటర్ ఇండియా' చిత్ర షూటింగ్ జోరుగా.. హుషారు గా సాగింది. పట్టణంలోని యతిరాజారావు పార్కులో నటీనటులపై పలు కీలక సన్నివేశా లను చిత్రీకరించారు. 'బ్రెయిన్ వాష్ బ్యానర్'పై ఎస్పీ ఉపేందర్ దర్శకత్వంలో 'సమాజంలో ఆడ బిడ్డలపై దాడులు, ఆత్మరక్షణ విద్యలు, తదితర అంశాలే ఇతివత్తంగా సినిమా చిత్రీకరణ కొన సాగింది. పాఠశాల విద్యార్థుల, కరాటే విద్యపై పలు సీన్లు షూట్ చేశారు. ఇటీవలే కొత్త హంగులు సంతరించుకున్న యతిరాజారావు పార్కులో సినిమా చిత్రీకరణ చేపట్టడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. చలనచిత్రంలో కీలకపాత్రలో చిన్నారి
అను, తండ్రి పాత్రలో శ్రీనివాస్, కరాటే శిక్షకుడిగా మాస్టర్ శ్రీధర్ నటించి మెప్పించారు. ఈ సందర్భంగా దర్శకుడు ఎస్పీ ఉపేందర్ మాట్లాడారు. మహిళలను గౌరవించాల్సిన సామాజిక అవసరాన్ని ప్రతిఒక్కరూ గుర్తించాలని ఆకాంక్షించారు. బాలికలు, యువతులపై దాడులు కొనసాగడం బాధాకరమన్నారు. దేశం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్న తరుణంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని చెప్పారు. అన్ని రంగాల్లోనూ మహిళలు సమర్ధత చాటి అఖండ విజయాలు సాధిస్తున్నారన్నారు. మహిళలను ప్రోత్సహించి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత సమాజం మీదే ఉందని స్పష్టం చేశారు. కుటుంబాల్లో మహిళల పట్ల వివక్ష చూపడం తగదన్నారు. ఆడబిడ్డలు ఎందులోనూ తీసిపోరనే ఇతివత్తంతో సినిమా చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు. సినిమాను మహిళలు, విద్యార్థులు, యువత సమా అన్ని తరగతుల ప్రజలు ఆదరించాలని కోరారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చెప్పారు. చిత్రీకరణలో కౌన్సిలర్ మాడుగుల నట్వర్, సహ దర్శకులు రాజు, శివ, చిత్ర నిర్మాణ ప్రతినిధులు ఉదరు, శివ, కరాటే మాస్టర్ సోమ శ్రీధర్, బోడ భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.