Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహాదేవపూర్
మహాదేవపూర్ మండలం అన్నారం గ్రామంలో బుధవారం అంబేద్కర్ 130 జయంతిని పురస్కరిం చుకుని మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు అంబ ేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల కోసం పాటు పడ్డారన్నారు. ప్రతి వర్గాలకు రాజ్యాంగంలో అన్ని హక్కులు కల్పించాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోష కర మన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు అన్నారం ఎంపీటీసీ మంచినీళ్ల దుర్గయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జెడ్పీటీసీ గుడాల అరుణ, మండల అధ్యక్షులు ఎండి అక్బర్ ఖాన్, ఎంపీటీసీ ఆకుతోట సుధాకర్, అన్నారం సర్పంచ్ వేము నూరి రమాదేవి, శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.