Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తాజా మాజీ కార్పొరేటర్ జక్కుల వెంకటేశ్వర్లుయాదవ్
నవతెలంగాణ-హసన్పర్తి
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం యువత పాటుపడాలని తాజా మాజీ కార్పొరేటర్ జక్కుల వెంకటేశ్వర్లుయాదవ్ పిలుపునిచ్చారు. గ్రేటర్ 55వ డివిజన్ కేంద్రం భీమారం సెంటర్లో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం డాక్టర్ బీఆర్ అంబ్కేర్ తన జీవితాన్ని దారపోసారని తెలిపారు. నిరుపేదలు అన్ని రంగాలలో రాణించేందుకు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించారని తెలిపారు. అట్టడుగు వర్గాల ప్రజలు రాజకీయాలలో రాణించాలని ఆకాంక్షించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు నాయకపు సమ్మయ్య, అటికం రవిందర్గౌడ్, గడ్డం శివరాం, ఆకుల కుమార్, సుమన్, తదితరులు పాల్గొన్నారు.