Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసత్య ఆరోపణలు మానుకోవాలి
- టీఆర్ఎస్ జిల్లా నాయకులు బుర్ర రమేష్ గౌడ్
నవతెలంగాణ-భూపాలపల్లి
బడుగుల అభివద్ధే భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి లక్ష్యమని ఆయనపై బీసీ సంక్షేమ సంఘం పేరుతో అసత్య ఆరోపణలను చేయడం సరైంది కాదని టీఆర్ఎస్ జిల్లా నాయకులు బుర్ర రమేశ్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గండ్రపై అసత్య ఆరోపణలు చేసిన వారికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్నారు. గిరిజనులు, బలహీన వర్గాలు ఎక్కువ నివసించే అడవి గ్రామాలకు డబుల్ రోడ్డు, పాఠశాల భవనాలులు, ఆజాంనగరంలో ప్రభుత్వ ఆసుపత్రి నెలకొల్పిన ఘనత గండ్రకే దక్కుతుందన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలో ఎంపీటీసీ, సర్పంచ్ జనరల్‌కు కేటాయించిన స్థానాల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు టికెట్లు ఇచ్చి రాజకీయ అవకాశం కల్పించారని గుర్తు చేశారు. ఇప్పటికైనా అసత్య ఆరోపణలు మానుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ జిల్లా నాయకులు గడ్డం కుమార్ రెడ్డి, బండారి రవి, జోజుల సమ్మయ్య, బైరెడ్డి లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు బుర్ర రాజు, టిఆర్ఎస్ జిల్లా మైనారిటీ అధ్యక్షులు కరీం, మండల సీనియర్ నాయకులు, దుండ్ర మల్లేష్, కోల రాయమల్లు, టీబీజీకేఎస్ నాయకులు సురేందర్ రెడ్డి, ఆముదాల రామచందర్ తదితరులు పాల్గొన్నారు.