Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహదేవ్పూర్
మహనీయులను చరితను మరిచి, ప్రజలకు మాయమాటలు చెబుతూ, కల్లబొల్లి కబుర్లతో కాంగ్రెస్ పార్టీ కాలం వెళ్లదీస్తున్నదని పెద్ద పల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల జెడ్పీ చైర్మన్లు పుట్ట మధుకర్, జక్కు శ్రీ హర్షినిలు ధ్వజ మెత్తారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై, ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అంబేద్కర్ విగ్రహానికి భారీ పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో వారు మాట్లాడుతూ దేశం, రాష్ట్రం కోసం త్యాగాలు చేసిన మహనీయుల చరిత్రను మంథని నియోజకవర్గం లోని కాంగ్రెస్ పార్టీ నాయకులు విస్మరిం చారని విరుచుకుపడ్డారు. మంథని నియోజకవర్గంలో గతంలో పాలించిన కాంగ్రెస్ పార్టీ నేతలు వారి పార్టీ నాయకుల విగ్రహాలకు ప్రాధాన్యం ఇచ్చారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహనీయుల విగ్రహాలకు పెద్ద పీట వేసి అడుగడుగున చరిత్రను ప్రజలకు అవగతమయ్యే విధంగా టిఆర్ఎస్ పార్టీ కషి చేస్తుందన్నారు. అంబేద్కర్ నూతన భవన నిర్మాణానికి నిధులు ఇప్పించాలని ఈ సందర్భంగా దళిత నాయకులు ఎంపీ, జడ్పీ చైర్మన్ల కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మహా దేవ పూర్ సర్పంచ్ శ్రీపతి బాపు ,ఎంపీపీ బన్సోడ రాణి భాయి రామారావు, మార్కెట్ కమి టీ చైర్ పర్సన్ ఆన్కారి భవాని ప్రకాష్, సింగల్ విండో సొసైటీ చైర్మెన్లు చల్ల నారా యణ రెడ్డి, సల్ల తిరుపతిరెడ్డి ,అంబేద్కర్ విగ్రహావిష్కరణ కమిటీ కన్వీనర్లు తగరం శంకర్ లాల్, లింగాల రామన్న, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు లింగంపల్లి శ్రీనివాస రావు యూత్ అధ్యక్షులు అలీంఖాన్ తదితరులు పాల్గొన్నారు.