Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ములుగు సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్
నవతెలంగాణ-శాయంపేట
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని ములుగు సబ్ రిజిస్టార్ తస్లీమా మహమ్మద్ పిలుపునిచ్చారు. బీఆర్ అంబేద్కర్ 130 వ జయంతిని పురస్కరించుకొని బుధవారం మండల కేంద్రంలోని తైబజార్లో బీఎస్ఎస్ అధ్యక్షులు క్రాంతి కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ దేశానికి గొప్ప మేధావి విశ్వజ్ఞాని అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం తోనే ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ, సమానత్వం లభించిందన్నారు. ప్రతి ఒక్కరూ మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రీబాయి పూలే, అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సర్పంచులు కందగట్ల రవి, చిట్టిరెడ్డి రాజిరెడ్డి, బొమ్మకంటి సాంబయ్య, అరికిళ్ళ ప్రసాద్, పరకాల ఏఎంసీ మాజీ చైర్మన్ పోలేపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ రేణుగుంట్ల సదయ్య, ఎమ్మార్పీఎస్ నాయకులు దేవయ్య, సదయ్య, బీఎస్ఎస్ నాయకులు సుమన్, భరత్, సురేష్, తదితరులు పాల్గొన్నారు.