Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆరూరి కుమార్
- పూలే, అంబేడ్కర్ మహనీయులకు నీలి దండు కవాతుతో నివాళి
నవతెలంగాణ-న్యూ శాయంపేట
దేశంలో రోజు రోజుకూ పెరిగి పోతున్న మతోన్మాద శక్తులతో ప్రమాదం పొంది ఉందని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆరూరి కుమార్ అన్నారు. బుధవారం అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా కేవీపీఎస్ ఆధ్వర్యంలో నీలి దండు కవాతుతో హనుమకొండ కాళోజీ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు వరంగల్ అర్బన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కవాతు నిర్వహించారు. ఈ కవాతును ఉపా ధ్యక్షులు గడ్డం కృష్ణ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సంఘం జిల్లా అధ్యక్షులు గబ్బిట కుమార్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా హాజరైన ఆరూరి కుమార్ మాట్లాడుతూ దేశంలో మతోన్మాద శక్తుల బావ జాలం పెరిగిపోతున్నదని అవి దేశంలో అసమానతలను పెంపొందించే కుట్రలు చేస్తున్నాయన్నారు. లౌకిక వాద రాజ్యాంగానికి రక్షణ కరువై ప్రమాదకర పరిస్థితులు దాపు రించాయని ఇవి చాలా ప్రమాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు ప్రపంచ మేధావిగా మహాజ్ఞాని గా గుర్తించబడుతున్న అంబేద్కర్‌కు ఈ దేశంలో అవమానాల పరంపర జరుగుతుండడం సిగ్గుచేటన్నారు. ఆ మహా నుభావుడి 130వ జయంతి ప్రపంచమంతా జరుపుకోవటం దేశానికే గర్వకారణమన్నారు. దేశంలో దళితులు అణగారిన వర్గాలపై హత్యలు అణచివేతలు రోజురోజుకూ పెరుగు తున్నాయని వాటిని తిప్పికొట్టేందుకు లౌకిక వాద సామా జిక శక్తులు ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భారత రాజ్యాంగ పరిరక్షణకై చైతన్యం కల్పిస్తూ ఉద్యమాలు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు సింగారపు దాసు, ఆవుల ఉదరు ,మైకేల్ కుమారస్వామి, మంద సంపత్ నరేష్, అశోక్ ,ప్రభాకర్, మంజుల, స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.