Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వినియోగదారుల్లో గుబులు
నవతెలంగాణ-మంగపేట
అదనపు లోడు డెవలప్మెంట్ చార్జీల పేరిట విద్యుత్ అధికారులు వినియోగదారుల జేబుకు చిల్లు పెడు తున్నారు. నెలకు సగటున రూ.150 నుండి రూ.250 బిల్లులు చెల్లించే వినియోగదారులకు డెవలప్ మెంట్ చార్జీల పేరిట ఏకంగా రూ.3500 నుండి రూ.4 వేలు చెల్లించాలంటూ బిల్లులు అందజేశారు. ఇంత బిల్లులు ఎలా కట్టాలంటూ మండల వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్చీ, ఏప్రిల్ నెలల బిల్లుల రీడింగ్ లో అదనపు బాధుడు షురూ అయింది. ఎనర్జీ లోడ్ వస్తు వులను బట్టి ఏసీ 1000 నుండి 3000 వాట్లు, కంప్యూటర్ 100-250, వాటర్ హీటర్ 550-1500, మిక్సీ 150-750, ఫ్రిజ్ 60-250, బల్బులు 5-60, సీలింగ్, టేబుల్ ప్యాన్లకు 50-150 వాట్ల విద్యుత్ ఖర్చవుతుందనేది విద్యుత్ శాఖ లెక్క. ఇవిగాక ఇంట్లో అదనంగా వాడు విద్యుత్ పరికరాలు పెరిగితే లోడ్ పెరుగుతుంది. ఒక కిలోవాట్ కనెక్షన్ తీసుకుని రెండు కిలోవాట్ విద్యుత్ వినియోగిస్తే అదనపు కిలోవాట్ కు డెవలప్ మెంట్ చార్జీల పేరిట విద్యుత్ శాఖ 2836 రూపాయలను వసూలు చేస్తుంది. సెక్యూరిటీ డిపాజిట్ పేరిట 4 వందలు కలిపి మొత్తం 3236 వసూలు చేస్తున్నారు. దీంతో మండల కేంద్రంతో పాటు కమలాపురం, రాజుపేట తదితర గ్రామాల్లో కిరాయి దారులకు ఇంటి యజమానులకు మద్య విద్యుత్ బిల్లు వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. బిల్లు వరకే తాము చెల్లిస్తామని డెవలప్ మెంట్ చార్జీలతో తమకు సంబంధం లేదని అద్దెదారులు వాదిస్తున్నట్లు యజమానులు వాపోయారు.
అధిక లోడ్‌ను బట్టే బిల్లు : ట్రాన్స్ కో ఏఈ ఆలేటి శ్రీధర్
మీటర్లు తీసుకునేటప్పుడు యజమానులు ఇచ్చే లోడును బట్టి కనెక్షన్ ఇస్తాం. అప్పటి నుం3కే ఎక్కువ విద్యుత్ వాడుకున్నట్లైతే మీటర్ రీడింగ్ లో ఉండే ఆర్ఎండీ ద్వారా అధికలోడ్ వాడిన విషయం బయటపడుతుంది. దీన్ని బట్టే విద్యుత్ శాఖ డెవలప్ మెంట్ చార్జీలు వసూలు చేస్తుంది. రెండు నెలలుగా మండలంలో అధికలోడ్ వినియోగం చేస్తున్న వినియోగదారులను గుర్తించాం. వారికే ఏప్రిల్ నెల బిల్లుల్లో చార్జీలు విధించాం. విద్యుత్ వినియోగం పెరిగినప్పు డు ట్రాన్స్ ఫార్మర్లపై లోడు పెరుగుతుంది. దాని సామర్థ్యం పెంచకపోతే లోవోల్టేజ్ సమస్య తలెత్తే అవకాశాలున్నాయి. ఆయా ట్రాన్స్ ఫార్మర్ల సార్థ్యం, మౌలిక సదుపాయలాలను పెంచేలా చర్యలు తీసుకుంటున్నాం.