Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధర్మసాగర్
అంటరానితనం రూపు మాపడంలో అలు పెరుగని పోరాట యోధుడు డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ అని ఎల్కుర్తి అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కొలిపాక జయరాజ్ అన్నారు. బుధవార్ం అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా మండలంలోని ఎలుకుర్తి గ్రామంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి ఘనంగా జయంతిని ఘనంగా జరుపుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దళితులు, మహిళలు, కార్మికుల హక్కు ల కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు అంబేద్కర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎలుకుర్తి అంబేద్కర్ సంఘం ప్రధాన కార్యదర్శులు గాజుల సదానందం, మాదాసి నవీన్,గౌరవ అధ్యక్షులు మాదాసి రమేష్, ఉపాధ్యక్షులు ఇంద కష్ణ, సండ్ర శేఖర్,జోగు చిరంజీవి, గ్రామ సర్పంచ్ మాదాసి అరుణ యాదగిరి, ఉప సర్పంచ్ బేర రాజేష్, వైస్ ఎంపీపీ బండారి రవీందర్ పాల్గొన్నారు.