Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తరిగొప్పుల : భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ 130వ జయంతిని బు ధవారం మండల కేంద్రంలో బస్ స్టాండ్ అవరణలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పలువురు పూల మాలలు వేసి నివాళి అర్పించారు. ఎంపీడీఓ ఇంద్ర సేన రెడ్డి, సర్పంచ్‌లు ప్రభుదాస్,వీరేందర్,వైస్ ఎంపీపీ, ప్రమీల, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
నర్మెట్ట : మండలం లోని ప్రభుత్వ కార్యాలయాల్లో గ్రామపంచాయితీ కార్యాలయాల్లో అంబేద్కర్ జయంతిని నిర్వహించారు. సర్పంచులు రామిని శివారాజు, లకావత్ కిరణ్ నాయక్ మాదిగ సహకార సంఘ అధ్యక్షులు గజ్జెలి చంద్రయ్యతోపాటు నాయకులు పాల్గొన్నారు. అలాగే ఎంపీపీ తేజావత్ గోవర్ధన్ ఆధ్వర్యంలో ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో అంబెద్కర్ జయంతిని నిర్వహించారు. ఎంపీపీ గోవర్ధన్, జడ్పీటీసీ మాలోత్ శ్రీనివాస్,ఎంపీడీఓ ఖాజా మోయినుద్దీన్ పాల్గొన్నారు.
లింగాలఘనపురం : ఎంపీపీల ఫోరమ్ జిల్లా అధ్యక్షురాలు చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి, మండల అధ్యక్షుడు నాగేందర్ ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అధ్యక్షుడు బొల్లంపల్లి నాగేందర్, దిశ కమిటీ సభ్యులు ఉడుగుల భాగ్యలక్ష్మి, గవ్వల మల్లేష్ , నెల్లుట్ల రవీందర్ రావు , ఎంపీటీసీ ల ఫోరం అధ్యక్షులు గండి మంగమ్మ యాదగిరి పాల్గొన్నారు.
లింగాలఘనపురం : మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. మండల ప్రధాన కార్యదర్శి గండి సురేష్, గ్రామ శాఖ అద్యక్షులు మేడ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
పాలకుర్తి : మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎంపీపీ నల్ల నాగి రెడ్డి, జడ్పీ ఫ్లోర్ లీడర్ పూస్కూరి శ్రీనివాస రావు, ఐలమ్మ మార్కెట్ కమిటీ చైర్మన్ ముస్కు రాంబాబు టీిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన, దర్దేపల్లి లో ఎస్ఐ గండ్రాతి సతీష్. సర్దార్ సర్వాయి పాపన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ మూల వెంకటేశ్వర్లు గౌడ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చెన్నూరు లో ఎంపీటీసీ కళింగ రావు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శాతపురం. గూడూరు లక్ష్మీనారాయణపురం గ్రామాలతోపాటు పలు గ్రామాల్లో అంబేద్కర్ యువజన సంఘాల ఆధ్వర్యంలో జయంతి నిర్వహించారు. పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు చిలువేరు కష్ణమూర్తి పాలకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ మండల కాంగ్రెస్ అధ్యక్షులు గిరగాని కుమారస్వామి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
కేసముద్రం/కేసముద్రం రూరల్ : మండలంలో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహిచారు. ఉప్పరపల్లి గ్రామములోని అంబెడ్కర్ విగ్రహానికి పూలమాల వేస నివాళులు అర్పించారు. గ్రామ ఇంచార్జి సర్పంచ్ ఏలబోయిన సారయ్య , మాజి సర్పంచ్ శ్రీరామోజు మహేశ్వర చారీ , ఎంపీటీసీ కండల కష్ణమూర్తి , మంద సాయి బాబా ,అనేపక వెంకన్న , సంకు శ్రీనివాస్ రెడ్డి , జోగు డంగయ్య పాల్గొన్నారు . కేసముద్రం స్టేషన్ లో, అంబెడ్కర్ సెంటర్ లో యువజన సంఘం మండల అధ్యక్షుడు దండు నగేష్ ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు మందుల కష్ణమూర్తి , సర్పంచ్ బట్టు శ్రీనివాస్ , మార్కెట్ చైర్మన్ మర్రి నారాయణ్ రావు పాల్గొన్నారు.
మరిపెడ : మరిపెడ మండల కేంద్రంలోని అబ్బాయిపాలెం గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. టీజీపీఏ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ జిన్నా పవన్ కుమార్ అధ్యక్షతన, అంబేద్కర్ యువజన సంఘం, టిజిపిఎ, స్వేరోస్, కెవిపిఎస్ ఆధ్వర్యంలో జయంతిని నిర్వహిచారు. సర్పంచ్ జినక మనీ ఇద్దయ్య, గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ (టిజిపిఎ) భద్రాద్రి జోనల్ కార్యదర్శి ఐనాల పరశురాములు, ప్రముఖ జర్నలిస్టు సామాజిక ఉద్యమకారుడు జి న్నా లచ్చన్న పాల్గొన్నారు. అలాగే మరిపెడ మండల కేంద్రంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బాణాల రాజన్న ఆధ్వర్యంలో నివాలులర్పించారు.
తొర్రూరు : సీఐ కరుణాకర్‌రావు, తాసిల్దార్ వేమిరెడ్డి రాఘవరెడ్డి, జడ్పీ ఫ్లోర్ లీడర్ మంగళపల్లి శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ రామచంద్రయ్య, కమిషనర్ గుండె బాబు ఆద్వర్యంలో అంబేద్కర్ జయంతి నిర్వహించారు. అలాగే టీపీటీఫ్ మహాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి సూరం ఉపేందర్ రెడ్డి ఆద్వర్యంలో నివాళి అర్పించారు.
గూడూరు : గూడూరు మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని నిర్వహించారు. సంఘం మండల అధ్యక్షులు చదవాలా వీరస్వామి పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కన్వీనర్ పి. రామయ్య, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి పాశం సాంబయ్య, జిల్లా యువజన సంఘం ఉపాధ్యక్షులు చిదురి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిడిఓ స్వరూప. తెలంగాణ ఏ టి హెఫ్ సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు సిద్ధమైన బిక్షమయ్య ఆధ్వర్యంలో మండల కేంద్రంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు
నెల్లికుదురు : సీపీఐ(ఎం) మండల కార్యదర్శి పెరుమాండ్ల తిలక్ బాబు, సిఐటియు మండల కార్యదర్శి బాబు గౌడ్, కేవీపీఎస్ మండల అధ్యక్షుడు అశోక్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో అంబేద్కర్‌కు నివాళి అర్పించారు. మండల కేంద్రంలో దళిత యువ శక్తి కన్వీనర్ అశ్విన్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను పురస్కరించుకొని బైక్‌లపై తిరిగే వారికి మాస్క్ ల పంపిణీ నిర్వహించారు. ఎర్రబెల్లి గూడెం అంబేద్కర్ కాలనీ లో ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు బత్తిని అనిల్ గౌడ్ తహసిల్దార్ర మేష్ లతో కలిసి మొక్కలు నాటారు.
తొర్రూరు : పెద్దవంగర ఎక్స్ రోడ్ వద్ద జయంతి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని నిర్వహించారు. ఎంపీపీ ఈదురు రాజేశ్వరి, సర్పంచ్ వెనక దాసుల లక్ష్మీ, రామచంద్ర శర్మ , స్థానిక ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సిరి శీను, ఎంపీవో కిన్నెర యాకయ్య పాల్గొన్నారు.
నర్సింహులపేట : మండల కేంద్రంలో ఎంపీడీవో ఆఫీస్ ఆవరణల ఎంపిపి సుశీల యాదగిరి రెడ్డి, జెడ్పిటిసి సంగీత ఆధ్వర్యంలో అంబేద్కర జయంతి నిర్వహించారు.
బయ్యారం : మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహానికి కుల సంఘాల నాయకులు, పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సింగారం గ్రామ పంచాయతీలో సర్పంచ్ బానోత్ కోటి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.
తొర్రూరు : వీరనరసింహ సేవా సంఘం ప్రధాన కార్యదర్శి పస్తం సాంబ ఆధ్వర్యంలో సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు,బేడ (బుడగ) జంగాల నాయకులు పస్తం సైదులు అదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు కొండపల్లి శ్రీనివాస్, డివిజన్ అధ్యక్షులు కిన్నెర చిన్న గురవయ్య అధ్యక్షతన బుధవారం తొర్రూర్ డివిజన్ కేంద్రంలోని స్థానిక కార్యాలయంలో అంబేద్కర్‌కు నివాళులర్పించారు.
కేసముద్రం రూరల్ : కేసముద్రం మండల లో ని ఉప్పరపల్లి గ్రామంలో అంబేద్కర్ యువజన నాయకులు మంద సాయిబాబ,అన్నెపాక వేంకన్న ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి నాయకులు కుల సంఘాలు మేధావులు పూలమాలలు వేసి అంబేద్కర్ జయంతిని నిర్వహించారు.
దంతాలపల్లి : ఎంపీడీవో కార్యాలయంలో జిల్లా వైస్ చైర్మన్ నూకల వెంకటేశ్వర్ రెడ్డి ఎంపీపీ ఉమా మల్లారెడ్డి అంబేద్కర్ పటానికి పూలమాలలు చేశారు. సీపీఐ(ఎం) మండల కార్యదర్శి శ్రీనివాస్, వీరభద్రాచారి పాల్గొన్నారు.
మంగపేట : మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కమలాపురం, తిమ్మంపేట, రాజుపేట, అకినేపల్లి మల్లారం, బుచ్చంపేట లోని అంబేద్కర్ విగ్రహాలకు తెలంగాణ మాల మహానాడు, అంబేద్కర్ యువజన సంఘాలు, టీఆర్ఎస్, సీపీఐ(ఎం) నాయకులు పూల మాలలు వేసి నివాలి అర్పించారు.
కొడకండ్ల : మండల కేంద్రంలో వరంగల్ డిసిసిబి వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతని నిర్వహించారు. మాలమహానాడు మండల అధ్యక్షుడ జవాజి ప్రవీణ,ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్ కాంగ్రెస్ అధ్యక్షుడు రవీందర్ స్థానిక, సర్పంచ్ మధుసూదన్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాము ఆధ్వర్యంలో పలు చోట్ల నివాళులర్పించారు.
ములుగు : ములుగు జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుడు జన్ను రవి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అల్లెం అప్పయ్య పాల్గొని మాట్లాడారు. ములుగు ఎస్సై హరికృష్ణ, స్వేరోస్ సర్కిల్ కాలేశ్వరం జోన్ అధ్యక్షులు బొట్ల కార్తీక్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ జిల్లా సభ్యులు రవి పాల్గొన్నారు.
తాడ్వాయి : మండలంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బండారి చంద్రయ్య, మాజీ మండల అధ్యక్షులు దిడ్డి మోహన్ రావు, మండ్రాతి రాజశ్రీ, సర్పంచులు ఇర్ప సునీల్ దొర, పుల్లూరు గౌరమ్మ, గొంది శ్రీధర్, ఆర్ ఐ చంద్రమోహన్ తదితరులు అంబేద్కర్ జయంతిని నిర్వహిచారు.