Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూ నిర్వాసితుల పరిహారంలో ప్రజాప్రతినిధుల వాటాఎంత ?
- స్థానిక ప్రజాప్రతినిధుల తీరుపై అనుమానాలు.?
- నోరు మెదపని రెవెన్యూశాఖ !
- న్యాయం జరిగేదాకా ఊరుకోబోం
- సింగరేణి భూ నిర్వాసితులు
నవతెలంగాణ-వెంకటాపూర్
పీవీ నరసింహారావు పేరిట ఓపెన్ కాస్ట్ గని ఏర్పాటులో భూసేకరణ విషయంలో స్థానికులకు తీరని అన్యాయం జరుగుతోంది. సింగరేణి అధికా రులను ప్రశ్నించాల్సిన స్థానిక ప్రజా ప్రతినిధులు యాజమాన్యం పక్షాన నిలవడం స్థానికులకు శాపంగా మారింది. దీంతో తమకు నష్టపరిహారం లో అన్యాయం జరిగిందంటూ రైతులు రోడ్డు నిర్మాణ పనులను నాలుగు పర్యాయాలు అడ్డుకున్నారు. మండల కేంద్రానికి చెందిన అధికార పార్టీ నాయ కులు, ప్రజాప్రతినిధులు సింగరేణి యాజమాన్యం నుంచి భారీ ముడుపులు స్వీకరించి స్థానికుల నోట్లో మన్ను కొడుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతు న్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులు స్థానికుల గోసను పట్టించుకోకపోవడం లేదని రైతులు కంటతడి పెడుతున్నారు. రెవెన్యూ అధికారులు కూడా అక్రమార్కులతో చేతులు కలపడం రైతుల పాలిట శాపంగా మారింది.
వెంకటాపూర్ మండల కేంద్రంలోని తాళ్ల పాడు నుంచి 3.8 కిలోమీటర్ల మేర ఓపెన్‌కాస్టు వరకు సుమారు రూ.3కోట్లతో రోడ్డు నిర్మాణానికి 2010లో భూములు సేకరించారు. అయితే నిర్మాణ పనులు ఆలస్యం కావడంతో రైతుల కబ్జా లోనే ఆ భూములు ఉన్నాయి. ప్రస్తుతం రోడ్డును నిర్మిం చేందుకు సింగరేణి యాజమాన్యం ప్రయత్నం చేస్తుండగా నిర్మాణ పనులను అడ్డుకున్నారు. తమ కు 2010లో కేవలం రూ.2600 చెల్లించి భూ ములు తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ, ప్రస్తుతం మార్కెట్ భూమి విలువ రూ.4లక్షల వరకు చెల్లించాలని ఆందోళన చేస్తున్నారు. 2021 మార్చిలో తొలిసారి జరిగిన భూనిర్వాసితుల ఆందోళనలో స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా పాల్గొని సింగరేణి యాజమాన్యం వైఖరిని ఖండించారు. తర్వాత మూడు సార్లు ఆందోళన చేపట్టినా ప్రజాప్రతినిధులు కన్నెత్తి చూడడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి యాజమాన్యం ఓ హోటల్లో స్థానిక ప్రజాప్రతి నిధులకు విందు ఏర్పాటు చేసి తమకు సహకరిస్తే కొంత సొమ్ము ముట్టచెబుతామన్నట్టు బోధించిన విషయం స్థానికంగా చక్కర్లు కొడుతోంది.
ప్రభుత్వ స్థలంలో ప్రజాప్రతినిధుల పాగా !
సింగరేణి భూసేకరణ లో సర్వేనెంబర్ 134 లో ఇప్పటివరకు ఏ రైతు పేరు లేనట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ మధ్యకాలంలో ప్రజాప్రతి నిధులు బినామీ పేర్లతో వేల ఎకరాల్లో రికార్డులకు ఎక్కించి ఆర్థిక ప్రయోజనం పొందేందుకు పావులు కదుపుతున్నట్టు సమాచారం. రెవెన్యూ అధికారులు సైతం ఈ భూ భాగోతంలో పాలు పంచుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి సింగరేణి భూనిర్వాసితుల ను ఓ పక్క, ప్రభుత్వ భూమిని కొల్లగొట్టి మరో రకంగా పబ్బం గడుపుకునేందుకు స్థానిక ప్రజాప్రతి నిధులు ప్రయత్నం చేయడం స్థానికులకు శాపంగా మారింది. ఇప్పటికైనా సింగరేణి భూనిర్వాసితులకు న్యాయం జరిగేలా అధికారులు కృషి చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.
మా దృష్టికొస్తే విచారణ చేపడతాం
వెంకటాపూర్ మండల కేంద్రంలో 134 సర్వేనెంబర్ లో ఎలాంటి పట్టాలు నేను వచ్చినప్పుడు నుండి మంజూరు కాలేదు గతంలో మంజూరైన పట్టాల విషయం లబ్ధిదారులకు అన్యాయం జరిగిందని నా దష్టికి వస్తే వెంటనే పై అధికారులకు తెలియజేసి ఆ విషయంపై విచారణ చేపడతాం
- తాసిల్దార్ మంజుల
భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి
వెంకటాపూర్ మండల కేంద్రంలో జరిగే ఓపెన్ కాస్ట్ పనులను నిలిపివేయాలని పలుసార్లు అధికారులకు విన్నవించాను విషయంపై భిక్షాటన చేపట్టి నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని పోరాటం చేశాను ఇప్పటికైనా అధికారులు దష్టి సాధించి ఓపెన్ కాస్ట్ లో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలి లేనియెడల న్యాయం జరిగేదాకా ఊరుకోమని హెచ్చరిస్తున్నాను.
- బోమేడ సాంబయ్య, సీపీఐ(ఎంల్) న్యూ డెమోక్రసీ జిల్లా నాయకుడు