Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూరు
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాన వతారాయి పై దాడి చేయడం హేయమైన చర్య అని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి సంతోష్ అన్నారు. తొర్రూర్ డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాగార్జున సాగర్‌లో జరిగే ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా మానవతా రాయి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నాడని అన్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల సహకారంతో కక్షపూరితంగా దాడిచేపించి ఆచూకీ తెలుపకపోవడం సిగ్గుమాలిన చర్య అన్నారు. ఇప్పటికైనా పోలీసులు మానవతారారుని బేషరతుగా విడుదల చేయాలన్నారు. లేదంటే జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రతి దళిత బిడ్డ ఈ సంఘటనను దృష్టిలో ఉంచుకుని సాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస అభ్యర్థి జానారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ బీసీ సెల్ మండల అధ్యక్షుడు దీకొండ శ్రీనివాస్‌గౌడ్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు లక్ష్మణ్, ఎస్టీ సెల్ మండల కార్యదర్శి జాటోత్ సురేష్‌నాయక్, తదితరులు పాల్గొన్నారు.
గార్లలో నిరసన
గార్ల : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి, నిరుద్యోగ జేఏసీ చైర్మెన్ మానవతరారుపై దాడి టీఆర్ఎస్ నిరంకుశ పాలనకు నిదర్శనమని సీతంపేట ఎంపీిటీసీ గుండె బోయిన నాగమణి అన్నారు. బుధవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో మండలకేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట బైటాయించి నిరసన తెలిపారు. దళిత నేత పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టి కృష్ణగౌడ్, జవహర్లాల్, రాము, రామకృష్ణ, రమేష్, దేవ్ సింగ్, యూత్ కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.