Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గార్ల
ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు మండల పరిధి రాంపురం గ్రామంలో ఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మెన్ బానోత్ హరిసింగ్ నాయక్ ఆధ్వర్యంలో బుధవారం భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. అణగారిన వర్గాల ప్రజలకు అండగా ఉంటూ వారి హక్కుల పరిరక్షణకు మార్గదర్శక సూత్రాలు అందించిన మహననీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ విగ్రహన్ని సొంత ఖర్చుతో ఇవ్వనున్నట్టు సభలో ప్రకటించారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ జి తారాబాయి, ఎంపిటీసి కె శ్రీనివాస్, ఉప సర్పంచ్ వై నవత, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పి రాధాకష్ణ, కె శ్రీనివాస్, జి సక్రు, గిరిప్రసాద్, ఎ వెంకటేశ్వర్లు, జి వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.