Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జయశంకర్ జిల్లా అదనపు ఎస్పీ వీ.శ్రీనివాసులు
- వరంగల్ అర్బన్, రూరల్, జయశంకర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా అంబేద్కర్
జయంతి వేడుకలు
నవతెలంగాణ-భూపాలపల్లి
ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదులు వేసి యావత్ ప్రపంచానికి బాబా సాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని జయశంకర్ జిల్లా అదనపు ఎస్పి వీ. శ్రీనివాసులు కొనియాడారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అంబేద్కర్ జయంతి సంద ర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను స్మరిం చుకున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని అందించి భారతదేశానికి ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనాన్ని చాటిన మహోన్నత నాయకుడు అన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి సీఐ వాసుదేవరావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు, సైదారావు, వేణు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు చక్రవర్తి, సతీష్, పోలీసు అధికారుల సంఘం నేత శోభన్ పాల్గొన్నారు. పీహెచ్సీ భూపాలపల్లిలో ప్రోగ్రాం ఆఫీసర్ డా. రవి కుమార్ మరియు సిబ్బం దితో కలిసి అంబేద్కర్ జయంతి సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.జె.సుధార్ సింగ్ నివాళులు అర్పించారు. జిల్లా ఎస్పీ అభివృద్ధి శాఖ అధి కారి సునీతతో కలిసి కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీఓ శ్రీనివాస్ అంబేద్కర్ చిత్రపటానికి, జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో గల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
సుబేదారి : వరంగల్ రూరల్ జిల్లా కలెక్టరేట్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరిత అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు.
గణపురం: మండలంలో వివిధ గ్రామాల సర్పంచ్‌లు అధికారులు ఘనంగా నివాళులర్పించారు. కేటీపీపీలో సీఐ సిద్దయ్య అంబేద్కర్ కాంస్య విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు.
ఎల్కతుర్తి: బస్టాండ్ కూడలి వద్ద అంబేద్కర్ విగ్రహానికిఅర్బన్ జిల్లా జెడ్పీ చైర్మెన్ మారేపల్లి సుధీర్ కుమార్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
పోచమ్మ మైదాన్ : బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలో అంబేద్కర్ విగ్రహానికి గ్రేటర్ కమిషనర్ పమేలా సత్పతి విగ్రహానికి పూలమాల సమర్పించి నివాళులు అర్పిం చారు. పోచమ్మమైదాన్ సెంటర్లో ఆయన చిత్రపటానికి ఏఐకేఎస్‌సీసీ నాయ కులు రాచర్ల బాలరాజు పూలమాల వేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు .
ఖానాపురం: మండల ప్రజా పరిషత్ కార్యాల యంలో ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు, ఓడిసిఎం చైర్మన్ రామస్వామి నాయక్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
న్యూ శాయంపేట: హన్మకొండ హంటర్ రోడ్ లోని బీజేపి వరంగల్ అర్బన్,రూరల్ జిల్లా పార్టీ కార్యాలయంలో వర్దన్నపేట మాజీ ఎమ్మెల్యే ఓబీసీ మో ర్చా కర్నాటక కాష్ట్ర ఇన్చార్జి డాక్టర్ వన్నాల శ్రీరాములు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. హను మకొండ అంబేద్కర్ సెంటర్లోని విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ ఆధ్వర్యంలో, టీఎస్ యూటీఎఫ్ వరంగల్ అర్బన్ రూరల్ జిల్లా శాఖల ఆధ్వర్యంలో వరంగల్ అర్బన్ డీఈఓ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు
మల్హర్ రావు: మండల పరిషత్, మండల తహసీల్దార్ కార్యాలయంతో పాటు అన్ని గ్రామ పంచాయతీల్లో ఘనంగా అంబెద్కర్ జయంతి వేడుకలను నిర్వహించి ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
శాయంపేట: మండల కేంద్రంలోని బస్టాండ్ లో అంబేద్కర్ విగ్రహానికి టిఆర్ఎస్, ఏఐఎఫ్బీ, వైఎస్ఆర్సీపీ, టీఆర్ఎస్వి, దళిత సంఘాల నాయకులు, గట్లకానిపర్తి గ్రామంలో విక్టరీ యూత్ సభ్యులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. గ్రామపంచాయతీ కార్యాలయాలలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపిడిఓ కార్యాలయంలో ఎంపీడీవో కష్ణమూర్తి, తహసీల్దార్ కార్యాలయంలో ఏ ఎస్ ఓ కుమారస్వామి అంబేద్కర్ చిత్రపటాలకు పూల మాల లు వేసి నివాళులర్పించారు. ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి, టీిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంగుల మనోహర్‌రెడ్డి, సర్పంచ్ కందగట్ల రవి పాల్గొన్నారు.
పరకాల రూరల్ : .పరకాల మండలంలోని వేల్లంపల్లి ,లక్ష్మీపురం ,నాగారం, వెంకటాపురం గ్రామా లలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహి ంచారు. వెల్లంపల్లి గ్రామంలో పరకాల ఎంపీపీ తక్కలపల్లి స్వర్ణలత, గ్రామ సర్పంచ్ వెలగండ్ల కష్ణ ,అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అంబేద్కర్ గొప్పతనాన్ని వివరించారు.
నయీంనగర్: విజయనగర్ కాలనీలో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్వర్యంలో, 53వ డివిజన్లో, హన్మకొండ బ్రహ్మణవాడలో, బీఎస్పీ పార్టీ కార్యాలయంలో, జనసేనా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు.
మహా ముత్తారం: మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వక్తలు మాట్లాడుతూ ఆయన చేసిన సేవలను కొనియాడారు.
వేలేరు: మండల కేంద్రంలో జరిగిన జయంతి ఉత్సవంలో జెడ్పిటిసీ చాడ సరితా పాల్గొన్నారు. అనంతరం ఆమె వృద్దులకు పండ్లు పంపిణీ చేశారు. మండలంతో పాటు గ్రామాలలోని ప్రదానకూడల్లలో అంబేద్కర్ విగ్ర హాలకు, చిత్రపటాలకు పూల మాల వేసి పండ్లు పంపిణీ చేశారు.
ఆత్మకూర్: ఆత్మకూర్ మండల కేంద్రంలో మండల ఎంపీపీ మార్క సుమలత రజినీకర్ అం బేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి స్వీట్లు పంపిణీ చేశారు. వైస్ ఎంపీపీ రేవూరి సుధాకర్‌రెడ్డి, గూడెప్పాడ్ ఏఎంసి చైర్మన్ కాంతాల కేశవరెడ్డి పాల్గొన్నారు.
రేగొండ: మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యా లయంలో డాక్టర్ దాదాసాహెబ్ అంబేద్కర జయంతి వేడుకలు ఎంపీపీ పున్నం లక్ష్మీ రవి ఆధ్వర్యంలో, టీఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు ఉమేష్ గౌడ్ ఆధ్వర్యంలో, జూబ్లీనగర్‌లో స్వేరోస్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు.
వరంగల్ లీగల్: జిల్లా కోర్టు లోని అంబేద్కర్ హాల్ లో వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో బార్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు నల్ల మహాత్మా , సీనియర్ న్యాయ వాదులు చీల రాజేంద్ర ప్రసాద్ లెక్కల జలంధర్ రెడ్డి, నీల శ్రీధర్ రావు దారా శ్రీశైలం సిహెచ్ లింగమూర్తి వసంతకుమార్ పాల్గొన్నారు.
సంగెం: సంగెంలోని అంబేద్కర్ సెంటర్లోని విగ్రహానికి వరంగల్ రూరల్ రెడ్ క్రాస్ చైర్మెన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్ రావు పూలమాల వేసి నివాళులు అర్పించారు. గవిచర్లలో జెడ్పీటీసీ గూడ సుదర్శన్ రెడ్డి నివాళులర్పించారు.
నల్లబెల్లి: నల్లబెల్లి గ్రామంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబ ద్కర్ యూత్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు.
పలిమెల: పలిమేల మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జవ్వాజి తిరుపతి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు.
కమలాపూర్: మండల కేంద్రంలోని అంబే ద్కర్ విగ్రహానికి ఎంపీపీ రాణి శ్రీకాంత్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాస్కులు శాని టేషన్ ఈటల భద్రయ్య చేతుల మీదుగా పంపిణీ చేశారు.
చిట్యాల: మండల కేంద్రంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో ఎంపీపీ వినోద వీరారెడ్డి పాల్గొని నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాలను కొన సాగించాలని ఈ సందర్బంగా పిలుపునిచ్చారు.
టేకుమట్ల: మండల కేంద్రంతోపాటు మండలంలోని అన్ని గ్రామాలలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి స్వీట్లు పంపిణీ చేశారు
ఖిలా వరంగల్: ఖిలా వరంగల్ మండలంలో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు అంబేద్కర్ విగ్రహాలకు, చిత్ర పటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఏసీరెడ్డినగర్‌లో టీఆర్ఎస్ నాయకులు సోమిశెట్టి ప్రవీణ్ ఆధ్వర్యంలో, 40వ డివిజన్ డీకే నగర్ కాలనీలో సీపీ(ఐ)ఎం ఏరియా కమీటీ ఆధ్వర్యంలో, కరీమాబాద్ దలితవాడ, మాలవాడలలో తెలంగాణ రామాబాయీ అంబేద్కర్ ఉమెన్స్ ఫెడరేషన్ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు తరాల రాజమణి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు.
కాశిబుగ్గ: కాశిబుగ్గ చౌరస్తాలో మాజీ కార్పొరేటర్ ఓని స్వర్ణలత భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించగా స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మెన్ గుండేటి నరేంద్ర కుమార్ ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
నర్సంపేట: మండలంలోని గురిజాల గ్రామంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. డాక్టర్ బీఆర్.అంబేద్కర్ జయంతి వేడుకల్లో సీపీఐ(ఎం), ఎంఆర్ పీఎస్, ఎస్ఎఫ్ఐ, ఏఐఎఫ్డీఎస్, ఆధ్వరొయలో పూల మాల వేసి నివాళర్పించారు. ఎంసీపీఐ(యు) కార్యాలయంలో బహుజన్ కిసాన్ ఎక్తా దివాస్ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ గుంటి రజినీకిషన్, వైఎస్ చైర్మన్ మునిగాల వెంకట్ రెడ్డి, కమిషనర్ విద్యాధర్ తదితర కౌన్సిలర్లు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్ల పంపిణీ చేశారు.
కాజీపేట: గ్రేటర్ వరంగల్ 34వ డివి జన్ మడికొండలో జయంతి నిర్వహించగా ముఖ్య అతిథులుగా వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కడిపికొండలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు బాస్కె దశరథం రాజేందర్ ఆధ్వ ర్యంలో, తరాలపల్లిలో నందు గ్రామాల కమిటీ ఆధ్వర్యంలో, కడిపికొండ ప్రధాన రహదారిపై ఆకారపు శివాజీ ఆధ్వర్యంలో, జాంబ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు.
కోల్ బెల్ట్: జయశంకర్ జిల్లా భూపాలపల్లి పట్టణ కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్టేడియంలో సింగరేణి ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, వివిధ కాలనీల్లో , కార్యాలయాల్లో 130వ జయంతి వేడుకలు నిర్వహించారు. అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన వేడుకలకు ముఖ్యఅతిథిగా ఈసీహెచ్ నిరీక్షణ రాజ్ హాజరై స్టేడియంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి, పంచశీల జెండా ఎగరవేశారు. అనంతరం గ్రౌండ్ లో మినీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.
నడికూడ: ఎమ్మెల్య్ఱే చల్లా ధర్మారెడ్డి నూతన అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ప్రారం భించారు. స్థానిక యువకులు ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది.
చెన్నారావుపేట: అంబేద్కర్ 130వ జయంతి పురస్క రించుకుని చెన్నారావు పేట మండల కేంద్రంలో ఎంపీపీ బాదావత్ విజేందర్ వైస్ ఎంపీపీ కంది కృష్ణారెడ్డి టిఆర్ఎస్ నాయకులు తొగరు చెన్నారెడ్డి వివిధ మండల అధికారులు పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కల్చెడ, పాత ముగ్ధుం పురంలో అంబేద్కర్ జయంతి నిర్వహించారు.
మొగుళ్ళ పల్లి: ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపిడిఓ రామయ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బిజెపి పార్టీ మండలాధ్యక్షుడు చెవ్వ శేషగిరి ఆధ్వర్యంలో, సమాచార హక్కు చట్టం ప్రచార సమితి జిల్లా అధ్యక్షుడు నిమ్మల భద్రయ్య ఆధ్వర్యంలో, వివిధ గ్రామాల గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ల ఆధ్వర్యంలో, వివిధ పార్టీల నాయకుల ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించారు.
మహదేవ్పూర్: కాటారం కూడలిలో అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా జెడ్పి చైర్ పర్సన్ జక్కు శ్రీ హర్షిని రాకేష్ పూలమాల వేసి నివాళులర్పించారు.
నెక్కొండ రూరల్: మండలంలో బుధవారం అంబేద్కర్ 130వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నెక్కొండలోని అంబేద్కర్ విగ్రహానికి స్ధానిక సర్పంచ్ యమున, ఉపసర్పంచ్ వీరభధ్రయ్య, సొసైటీఛైర్మన్ మారం రాము, ఎంపీటీసీ కరీష్మా, అంబేద్కర్ సంఘం అధ్య క్షులు యాకుబ్, జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, నాయకులు యాకయ్య, వార్డు సభ్యులు సాంబయ్య, మాలతి, సీపీఐ(ఎం), సీపీఐ మండల కార్యదర్శులు వెంకన్న, చెన్నకేశవులు తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు.
హసన్‌పర్తి : మండలంలోని సీతంపేటలో గ్రామ సర్పంచ్ జనగాం శరత్‌కుమార్ ఆధ్వర్యంలో, హసన్‌పర్తి ఎంపీడీవో కార్యాలయంలో, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
పర్వతగిరి: మండలం లోని చింత నెక్కొండ, కొంకపాక,చౌటపల్లి, ఆనంతారం, గోపనపల్లి, ఏనుగల్,అన్నారం షరీఫ్,కల్లెడ గ్రామాల్లో నిర్వహించారు, మండల కేంద్రంలో స్వేరోస్ ,ఆనంతారం లో అంబెడ్కర్ సంఘం, అన్నారం లో కెవిపిఎస్ ఆయా గ్రామాలలో సర్పంచ్ ల ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
పరకాల: పట్టణంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఓఎస్డీ శోభన్‌కుమార్ పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీగా రాజంపేట అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ భవన్లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఓఎస్డీ శోభన్‌కుమార్ పాల్గొన్నారు.