Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
నవతెలంగాణ-గోవిందరావుపేట
ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశా లలో పదోన్నతులు, బదిలీల షెడ్యూల్ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని పస్రా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఆర్ వాసుదేవ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడారు. కొన్ని ప్రాంతాల్లో కరోనా ప్రభావం తక్కువగా ఉన్న పాఠశాలలను తెరిచి నడిపించాలని కోరారు. 30 శాతం ఫిట్మెంట్ ప్రకటించిన సందర్భంగా సంబంధిత జీవోను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని అన్నారు. ప్రయివేటు ఉపాధ్యాయులకు రూ.2వేల నగదు ప్రకటించిన విధంగానే విద్యా వాలంటీర్లకు, గెస్ట్ టీచర్లకు, గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న వారికి కూడా ఆర్థిక సహాయం అందించాలని కోరారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ కరోనా ప్రభావం లేని ప్రాంతాల్లో పాఠశాలను నిర్వహించే విధంగా చర్యలు తీసు కోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దం వెంకటరెడ్డి, ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి దుప్పటి కిరణ్కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు మది అరుణ, జిల్లా కోశాధికారి పొడెం సమ్మయ్య, జిల్లా కార్యదర్శులు చెంచయ్య, వెంకటస్వామి, లక్ష్మీనారాయణ, రఘురాం స్వరూప, సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.