Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-లింగాలఘనపురం
తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును గురువారం హైదరాబాద్లోని ప్రగతి భవన్ లో ఉద్యమ కారుడు, జనగామ జిల్లా టీఆర్ఎస్ యూత్ నేత కందుకూరి ప్రభాకర్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పల్లె పల్లెల్లో టీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు యువత సైనికులుగా పనిచేయాలని సూచించారు. పని చేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు లభిస్తుందని తెలిపారు. త్వరలో నామినేటెడ్ పదవులకు అవకాశం ఇస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు.