Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏపీఎం కలకోటి సంపత్‌కుమార్
నవతెలంగాణ-ములుగు
ములుగు మండలంలోని నిరుద్యోగ యువతకు ఏప్రిల్ 19న ములుగు ఐకేపీ కార్యాలయంలో ఉచితన శిక్షణ, ఉపాధిమేళా నిర్వహించనున్నట్లు సెర్ఫ్ ఏపీిఎం కలకోటి సంపత్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. టూరిజం అండ్ హాస్పిటాలిటీ, ఫుడ్ అండ్ బేవరేజస్, సర్వీస్ స్టీవర్జ్, ఇన్వెంటరీ క్లర్క్, లాజిస్టిక్స్ ఎలక్ట్రానిక్స్, డీసీఏ కంప్యూటర్ కోర్సు, స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్క్, ఇంటర్వూ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్ మెంట్ రంగాల్లో ఆసక్తి ఉన్నవారికి మూడు నెలల ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. శిక్షణ కాలంలో ఉచిత భోజన వసతి, యూనిఫాం, స్టడీ మెటీరియల్, రూ 3వేల భ్రుతి అందించనున్నట్లు తెలిపారు. శిక్షణ అనంతరం నైపుణ్యం ఉన్నవారికి ఉద్యోగ అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.