Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూడాలని వరంగల్ ట్రాఫిక్ సీఐ నరేష్ కుమార్ తెలిపారు. ముస్లిం సోదరులు రోజాలో ఉంటు సాయంత్రం ఇఫ్తార్ టైంలో రోడ్డుపైన వాహనాలు అడ్డం దిడ్డం పెట్టడం వల్ల ట్రాఫిక్ ఇబ్బంది కలగడాన్ని గమనించిన ట్రాఫిక్ సీఐ గురువారం నాడు మండి బజార్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడి సమక్షంలో తోపుడు బండ్లు చిరు వ్యాపారస్తులు వాహనదారులకు ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా రోడ్డు పక్కన వాహనాలు నిలిపి చిరు వ్యాపారాలు నిర్వహించుకోవాలని కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్‌కి ఇబ్బంది తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తి పైన ఉన్నదని వ్యాపారస్తులు వాహనదారులు మండి బజార్ ప్రాంతంలో ట్రాఫిక్ అంత రాయం కలగకుండా చూడాలన్నారు. ఇఫ్తార్ అయిపోయిన తర్వాత వాహనాలు తోపుడు బండ్లు దూరంగా ఉంచాలని కోరారు. ఈ కార్యక్ర మంలో మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షులు మాషఉక్ అలీ మరియు అసోసియేషన్ సభ్యులు, ఎస్సై రామారావు, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.