Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గులాబీ జెండా ఎగరేస్తాం : ఛీఫ్ విప్ వినరుభాస్కర్
నవతెలంగాణ-వరంగల్
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌పై గులాబీ జెండా ఎగురవేస్తామని ఛీఫ్ విప్ దాస్యం వినరుభాస్కర్ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం హన్మకొండ నిత్యా బ్యాంకెట్ హాలులో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రేటర్ వరంగల్ నగరాన్ని రూ.3 వేల కోట్లతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. వరంగల్ నగర ప్రజలు అభివృద్ధిని చూసి ఓటేయ్యాలన్నారు. దేశంలో అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ టిఆర్ఎస్ అన్నారు. వరంగల్ నగరంలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశామన్నారు. నగర అభివృద్ధికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తీవ్రంగా కృషి చేశారన్నారు. ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణనేనన్నారు. టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే వరంగల్ నగరం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. గతంలో పనిచేసిన కార్పొరేటర్లు అద్భుతంగా పనిచేశారన్నారు. ఈ సమావేశంలో గ్రేటర్ వరంగల్ ఇన్‌ఛార్జి బొంతు రామ్మోహన్, గ్యాదరి బాలమల్లు, కుడా చైర్మెన్ మర్రి యాదవరెడ్డి, అజీజ్‌ఖాన్, నాగుర్ల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.