Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటి నుండి నామినేషన్లు
- 30న పోలింగ్
- మే 3న కౌంటింగ్
- 2 కేంద్రాల్లో నామినేషన్ల దాఖలు
నవతెలంగాణ-వరంగల్
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైందని, ఈ మేరకు ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గురువారం నుండి మే 3వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందన్నారు. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5.00 గంటలలోపు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. తుది గడువు ఈనెల 18, 19వ తేదీన నామినేషన్ల పరిశీలన, ఈనెల ఉపసంహరణకు 22వ తేదీ తుది గడువని వివరించారు. 80 ఏండ్లు నిండిన వారు, కోవిడ్ బాధితులకు బ్యాలట్ ఓటు వేసుకునే అవకాశముందన్నారు. సభలు, సమావేశాలు, ర్యాలీలలో ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలన్నారు. కోవిడ్ నిబంధనలు పాటించేలా ఒక నోడల్ అధికారిని నియమిస్తామన్నారు. సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా వుంటుందన్నారు. ఈనెల 30న పోలింగ్ జరుగుతుందని, ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ నిర్వహించ నున్నామన్నారు. రీపోలింగ్ అవసరమైతే మే 2వ తేదీన నిర్వహించడం జరుగుతుందన్నారు. మే 3వ తేదీన ఉదయం 8 గంటల నుండి కౌంటింగ్ ప్రారంభమవుతుందని, ఓట్ల లెక్కింపు పూర్తి కాగానే ఫలితాలను అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిపారు.
నేటి నుండి నామినేషన్ల దాఖలు
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు శుక్రవారం నుండి ప్రారంభమ వుతాయని చెప్పారు. నామినేషన్ల దాఖలుకు రెండు కేంద్రాలను ఏర్పాటు చేశామని, వరంగల్ ఎల్బి కాలేజీ, హన్మకొండలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలలో నామినేషన్ల దాఖలుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
వరంగల్ ఎల్బీ కాలేజీలో..
వరంగల్ ఎల్బి కాలేజీలో 1, 2, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44 డివిజన్లకు సంబంధించి 32 డివిజన్లకు నామినేషన్ల దాఖలు ఈ కేంద్రంలోనే ఏర్పాట్లు చేశామన్నారు.
ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో..
హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో 34 డివిజన్లకు నామినేషన్ల దాఖలుకు ఏర్పాట్లు చేశారు. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 29, 30, 31, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66 మొత్తం 34 డివిజన్లకు సంబంధించి నామినేషన్ల దాఖలు ఈ కేంద్రంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. విలేకరుల సమావేశంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి, డిపిఆర్ఓ బండి పల్లవి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పిఆర్ఓ ఆయూబ్ అలీ తదితరులు పాల్గొన్నారు.