Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నడికూడ
తాటి ఈత చెట్లను తొలగించిన వారిపై కేసు నమోదు చేసినట్టు ఎక్సైజ్ సీఐ జగన్మాధరావు తెలిపారు. ప్రొహిబిషన్ ఎక్సైజ్ పరకాల స్టేషన్ పరిధిలోని నడికూడ గ్రామ పంచాయతీ పరిధి వనంలోని తాటి చెట్లు ఈత చెట్లను తొలగించారనే విశ్వసనీయమైన సమాచారం మేరకు గురువారం తనిఖీ నిర్వహించగా బొమ్మ శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి తన సొంత భూమిలో జేసీబీ సహాయంతో 35 తాటి చెట్లను 20 ఈత చెట్లను ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా తొలగించినట్టు తెలిపారు. ఎక్సైజ్ శాఖ చట్టం ప్రకారం అనుమతులు లేకుండా తొలగించడం నేరం కాబట్టి బొమ్మ శ్రీనివాస్‌పై, జేసీబీ డ్రైవర్ పై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. జెసీబీ డ్రైవర్ పరారీలో ఉన్నారని ముందు జాగ్రత్త నిమిత్తం బొమ్మ శ్రీనివాస్‌ను నడికూడ తహసీల్దార్ ఎదుట ఒక సంవత్సర కాలానికి లక్ష రూపాయల పూనికత్తు మీద బైండోవర్ చేసినట్లు తెలిపారు. ఈ తనిఖీలలో ఎక్సైజ్ ఎస్సై పద్మ, సిబ్బంది లక్ష్మణా చారి, రమేష్, సమ్మయ్య, భాస్కర్, విష్ణువర్ధన్‌లు పాల్గొన్నారు.