Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు
నవతెలంగాణ-మల్హర్ రావు
మండల తహసీల్దార్ కార్యాలయం నూతవ భవనం నిర్మాణం నాసిరకంతో నిర్మిస్తున్నారని పలువురు వాపో తున్నారు. పనుల దగ్గరుండి పర్యవేక్షించాల్సిన సంబం ధిత అధికారులు అటువైపు రావడం లేదనే విమ ర్శలు వినిపిస్తున్నాయి. గుత్తేదారు నాణ్యత పాటిం చక పోవడం వలన కార్యాల యం నిర్మాణ పనులు ఎంతో కాలం ఉంటాయోనని మండల ప్రజలు ప్రశ్ని స్తున్నారు. మండల కేంద్రమైన తాడిచెర్లలోని మండల పరి షత్ కార్యాలయం పక్కన మోండి గోడలతో దాదాపు నాలుగేళ్ల అనంతరం నిర్మాణానికి మోక్షం కలిగింది. నిర్మాణ పనులకు డీఎమ్ఏప్టి నుంచి సోషల్ వెల్పేర్ డిపార్ట్ మెంట్ రూ.36 లక్షలు మంజూరై పనులు వారం రోజులుగా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా పనుల్లో సిమెంట్ తక్కువ, ఇసుక ఎక్కువ వేయడమే కాక నాసరకమైన సిమెంట్, ఇటుక వాడటం గోడల మధ్యలో పేరుకే బెడ్ పోసి నట్లు గా వేయడం ఇనుప రాడ్స్ వేయ కపోవడం, తూతూమంత్రంగా నీళ్లు పట్టడంతో పది కాలాలపాటుగా అగాల్సిన కార్యాలయం పది నెలల్లోనే పగుళ్లు తేలే ప్రమాదం పొంచివుందని పలువురు ఆరోపిస్తున్నారు.
నాణ్యత పాటించకుంటే చర్యలు తప్పవు
- సోషల్ వెల్పేర్ ఏఈ
పనుల్లో నాణ్యత పాటించేలా చూస్తాం. లేకుంటే గుత్తేదారి పై చర్యలు తప్పవు. మా పర్యవేక్షణ మేరకే పనులు జరుగుతాయి.