Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నవతెలంగాణ కథనంపై భూనిర్వాసితుల హర్షం
నవతెలంగాణ-వెంకటాపూర్
'ప్రభుత్వ భూమి పలహారం' అనే శీర్షికన గురువారం నవతెలంగాణలో ప్రచురితమైన కథనం స్థానికంగా చర్చనీయాంశమైంది. వెంకటాపూర్ మండల కేంద్రంలోని తాళ్ల పాడు నుంచి 3.8 కిలోమీటర్ల మేర ఓపెన్‌కాస్టు వరకు సుమారు రూ.3కోట్లతో రోడ్డు నిర్మాణానికి 2010లో భూములు సేకరించారు. కాగా పరిహారం విషయంలో బినామీలపై కథనం ప్రచురించగా భూనిర్వాసితులు హర్షం వ్యక్తం చేశారు. స్థానిక మండల ప్రజాప్రతినిధులు సింగరేణి అధికారులతో కుమ్మక్కైట్టు స్థానిక ప్రజలు విమర్శిస్తున్నారు. వెంకటాపూర్ మండల కేంద్రంగా ఎవరు ఆ బినామీలు..? వారికి సహకరిస్తున్న ప్రజాప్రతినిధులు ఎవరు..? అంటూ బాహాటంగానే చర్చించుకుంటున్నారు. జిల్లా రెవెన్యూ యంత్రాంగం కూడా ఆ అక్రమార్కులపై ఆరా తీసినట్టు విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వ భూమిలో బినామీగా పేర్లు ఎక్కించిన వారి గురించి ఆరా తీస్తున్నట్లు తెలిసింది. తీగలాగితే డొంక కదిలిన చందంగా ఈ వ్యవహారం అటు రెవెన్యూ అధికారులకు ఇటు ప్రజాప్రతినిధుల మెడకు ఉచ్చు బిగించేలా ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారు.