Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
దోపిడీ రహిత సమాజం కోసం ఉద్యమించాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఎండీ అమ్జెద్ పాషా, జిల్లా కార్యవర్గ సభ్యులు రత్నం రాజేందర్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని స్థానిక మహర్షి కళాశాలలో సీపీఐ(ఎం) ములుగు, వెంకటాపూర్ మండలాల పార్టీ సభ్యులు బొడ నర్సింగమ్ అధ్యక్షతన గురువారం శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు పాల్గొని మాట్లాడారు. దోపిడీ రహిత సమాజం కోసం సీపీఐ(ఎం) సభ్యులు, కార్యకర్తలు, సానుభూతిపరులు, ప్రజలు, ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు ప్రలోభ పెట్టి గెలిచిన తరువాత పెట్టుబడిదారులకు, బహుళజాతి కంపెనీలకు, కార్పొరేట్లకు దేశ సహజ సంపదను, ప్రభుత్వరంగ సంస్థలను కట్టబెట్టేందుకు కుట్ర పన్నుతున్నాయన్నారు. నిత్యావసర వస్తువులు, చమురు ధరలు పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు ఎండీి గఫూర్, అలువాల ఐలయ్య, కోటయ్య, కొర్ర రాజు, కలువల రవీందర్, కుమ్మరి సాగర్, ఎం నటరాజు, మంకిడి కష్ణయ్య, లింగమూర్తి, సదాయ్య, చంటి తదితరులు పాల్గొన్నారు.