Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
ఆర్యభట్ట హై స్కూల్ కరస్పాండెంట్ నెలకుర్తి మధుకర్ రెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని తెలంగాణా జర్నలిస్ట్ అసోసియేషన(టీజేఏ) జిల్లా అధ్యక్షుడు చిర్రగోని ఉదరు ధీర్, రాష్ట్ర నాయకులు బొలగని యాకయ్య, తొర్రూరు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పస్తం సైదులు డిమాండ్ చేశారు. ఈనెల 9న తొర్రూరు విలేకరి సిరికొండ విక్రమ్ కుమార్ను ఆర్యభట్ట మధుకర్ రెడ్డి వ్యక్తిగతంగా దూషించి, పాత లారీతో గుద్దించి చంపుతానని ఫోన్లో బెదిరించడాన్ని నిరసిస్తూ గురువారం డీఈఓ కార్యాలయం వద్ద విలేకర్లు, టీజేఏ యూనియన్ నాయకులు నిరసన తెలిపారు. అనంతరం డీఈఓ సోమ శేకరశర్మకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కరోనా రెండవ వేవ్ తీవ్రతను దష్టిలో ఉంచుకొని పాఠశాలలు తాత్కా లికంగా మూసివేసిందన్నారు. నిబంధనలు తుంగలో తొక్కి ఫీజుల కోసం విద్యార్థులకు పరీక్షలు నిర్వ హిస్తుండగా విషయాన్ని వాట్సప్ ద్వారా కలెక్టర్ కు ఫిర్యాదు చేశాడన్నారు. కాగా సదరు విలేకరి వత్తిని అవమాన పరుస్తూ దూషించడం సరికాదన్నారు. కుటుంబ సభ్యులను, మహిళలను దూషించడం విద్యాసంస్థల అధినేత అయిన ఆయనకే చెల్లుతుందన్నారు. ఈ ఘటనను జర్నలిస్ట్ లోకం తీవ్రంగా ఖిండించాలని కోరారు. వారం రోజులుగా జర్నలిస్టులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. వెంటనే పోలీస్ అధికారులు మధుకర్రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని, వెంటనే అరెస్టు చేయాలని, పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీజేఏ నాయకులు గొడుగు శ్రీనివాస్,కట్కూరి ప్రసాద్,మళ్లారపు నగేష్, వివిధ మండలాల జర్నలిస్టులు నూనె సుధర్, పులుసు సతీష్, రంపెల్లి రమేష్, సిరికొండ విక్రమ్, మిడతపెల్లి సురేష్, తదితరులు పాల్గొన్నారు.