Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడ
కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులను కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించి కరోనా పరిస్థితులపై వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. అనం తరం కలెక్టర్ మాట్లాడుతూ... గ్రామాల్లో 45 ఏండ్లు పైబడిన వారందరికి కోవిడ్ వ్యాక్సిన్ అందించేలా చూడాలన్నారు. ప్రతి గ్రామంలో కరోనా వ్యాధి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో నిర్మించిన రైతు వేదికను పరిశీలించారు. 11 గంటల సమయమైనా ఏఈఓ రాకపోవడంపై అధికారులపై మండిపడ్డారు. రైతు వేదికల బాధ్యత అగ్రికల్చర్ అధికారులకు అప్పగించే లా చూడాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఛత్రునాయక్ను ఆదేశించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. మండల కేంద్రంలో 1300కు పైగా 45 ఏండ్లకు పైబడిన వారున్నారని తక్షణమే మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్య కేంద్రంలో వారికి వ్యాక్సిన్ అందేలా చూడాలని సర్పంచ్‌కు సూచించారు. ఎవరైనా మాస్కులు లేకుండా వర్తక వ్యాపారాల షాపులు నిర్వహిసే సీజ్ చేయాలన్నారు. ప్రతి శుక్రవారం జరిగే సంతలో సామాజిక దూరాన్ని పాటిస్తూ. ఎప్పటికప్పుడు శానిటైజర్ చేయాలన్నారు. మాస్కులు లేకుండా రోడ్లపైకొచ్చేవారికి జరిమానాతో పాటు కేసులు నమోదు చేయాలన్నారు. అనంతరం కొత్తగూడ నుంచిి దుబ్బ గూడెం గ్రామం వరకు రూ.33 కోట్లతో మంజూరైన రోడ్డు, చెక్ డ్యామ్ పనులను పరిశీలించారు.