Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్
నవతెలంగాణ-మరిపెడ
మిషన్ భగీరథ పైపులైను లీకేజి మరమ్మతు పనులు పది రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు తాగునీటి కొరత లేకుండా చూడాలని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అధికారులను ఆదేశించారు. మరిపెడ మండల కేంద్రంలోని భార్గవి ఫంక్షన్ హాల్లో గురువారం మరిపెడ, చిన్నగూడూరు, నర్సింహులపేట దంతాలపల్లి మండలాల మిషన్ భగీరథ పెండింగ్ సమస్యలపై మిషన్ భగీరథ అధికారులు, ఆర్బ్ల్యూఎస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు, తొపాటు వివిధ మండలాల జెడ్పీటీసీలు ,ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.