Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తాగు నీటిని సరఫరా చేయాలి
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి
నవతెలంగాణ-జనగామ
అధికారులు నిర్లక్ష్యం వీడి ప్రజలకు తాగునీటిని సక్రమంగా సరఫరా చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మోకు కనుకారెడ్డి అన్నారు. గురువారం పట్టణంలో నిరసన తెలిపి ఆయన మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ ప్రధాన రహదారి వెంట ఉన్న పెట్రోల్ బంక్ ఎదుట రోడ్డు విస్తరణ పనుల్లో తాగునీటి పైప్ లైన్ పలిగిపోయిందన్నారు. ఎనిమిది రోజులుగా నీరు వృథా అవ్వడమే కాకుండా రోడ్లన్నీ జలమయమయ్యాయని అన్నారు. 2,3,4, 22 వార్డుల్లో తాగునీరు సరఫరా కాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యం వేడి రెండు రోజుల్లో పైపులైను మరమ్మతులు చేపించాలన్నారు. లేదంటే జనగామ పట్టణ ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున జనగామ మున్సిపాలిటీ ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపీ, పట్టణ కమిటీ సభ్యులు జోగు ప్రకాష్, సీనియర్ నాయకులు ఎండీ దస్తగిరి, పట్టణ కమిటీ సభ్యులు కళ్యాణం లింగం, పల్లెరుల లలిత, శాఖా కార్యదర్శి ఉపేందర్, నాగరాజు, శివ, ఎండీ మునీర్ తదితరులు పాల్గొన్నారు.