Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంగపేట
కుడుముల లక్ష్మీనారాయణ గిరిజనేతరులకు బినామీగా ఉంటూ గిరిజన చట్టాలు అమలుకాకుండా మంగపేట, పొద్మూరు, గంపోనిగూడెంలలోని గిరిజన పట్టాదారుల భూములు ఆక్రమించుకుని అడ్డకుంటున్నగిరిజనులపై పోలీసు కేసులు పెడుతున్నాడని మన్యసీమ పరిరక్షణ సమితి డోలుదెబ్బ రాష్ట్ర అద్యక్షుడు గొప్ప వీరయ్య శుక్రవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. లక్ష్మీనారాయణకు ఆయా గ్రామాల్లో ఎక్కడా భూములు లేవని ఓ గిరిజనేతరుని ఇంటినెంబరును తన ఇళ్లుగా చూపించి అమాయక గిరిజనుల వ్యవసాయ పట్టా భూములను ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు.
గంపోనిగూడెంలోని సర్వేనెంబర్ 11, 12, 13, 25, 101 లోని 1.36 గుంటల భూమి మేకల పిచ్చయ్య, మేకల లక్ష్మీనారాయణ, మేకల సమ్మయ్య, మేకల నర్సింగరావు, మేకల పోతురాజులు పట్టాదారులుగా ఉంటే వారి నుండి ఎలాంటి కొనుగోళ్లు చేయకుండా ఓ గిరిజనేతరునికి బినామీగా ఉండి పట్టాదారులకు తెలియకుండా కాగితాలు తయారు చేసి రెవిన్యూ, పోలీస్ అధికారులతో బెదిరించి భూములు లాక్కుంటున్నాడని ఆరోపించారు.