Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణ
నవతెలంగాణ-బయ్యారం
మోడీ ప్రభుత్వం కార్మిక, కర్షక, రైతుల, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని, దీనికి వ్యతిరేకంగా పోరాటం నిర్వహించాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఆరేల్లి కృష్ణ అన్నారు. శుక్రవారం మండలంలో తెలంగాణ టైల్స్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టీయూ)రాష్ట్ర కమిటీ సమావేశం సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బి రామ్‌సింగ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడారు. కార్మికవర్గం పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను, సౌకర్యాలను, నేడు మోడీప్రభుత్వం కాలరాస్తోందన్నారు. రైతువ్యతిరేక మూడు చట్టాలను రద్దుచేయాలని, 4 లేబర్ కోడ్ లను ఉపసం హరించుకోవాలని అన్నారు. లాభాలతో నడుస్తున్న ప్రభుత్వ రంగ పరిశ్రమలను కారుచౌకగా అంబానీ, ఆదానీ, కార్పొరేట్ శక్తులకు అమ్ముతున్నారని, దీనిని వ్యతిరేకిస్తూ పరిశ్రమల రక్షణ, ఉద్యోగ భద్రత, హక్కులసాధనకు ఐక్య పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. 4 నెలలుగా దేశ రాజధానిలో రైతులు చేస్తున్న పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని రైతాంగ పోరాటాలకు అండగా కార్మికవర్గం పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు సీతారామయ్య, తెలంగాణ టైల్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.కె మదర్, ఉపాధ్యక్షులు బి లింగ్యా, నాయకులు మూతి రాంబాబు, శ్రీరాములు, దుర్గాప్రసాద్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.