Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాపర్తి సోమయ్య
నవతెలంగాణ-జఫర్గడ్
గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని రైతు సంఘం జనగామ జిల్లా అధ్యక్షుడు రాపర్తి సోమయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా, మండలాలు పలు గ్రామాల్లో పది రోజుల నుంచి వరి కోతలు ప్రారంభమయ్యాయన్నారు. వరి కోతలు జరుగుతున్నా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం దారుణమన్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే టీఆర్ఎస్ మాటల్లో తప్ప చేతుల్లో లేదని ఎద్దేవా చేశారు. కొనుగోలు కేంద్రాలు లేక ప్రైవేటు వ్యాపారులు రైతుల వద్ద తక్కువ ధరతో కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన వర్షానికి వరి ధాన్యం తడిసి ముద్దైందని, ప్రభుత్వమే బాధ్యత వహించి మద్దతు ధర ఇవ్వాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ రైతులపై లేదని విమర్శించారు. కొనుగోలు కేంద్రం వెంటనే ప్రారంభించి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.