Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా సంక్షేమ శాఖ అధికారిని ప్రేమలత
నవతెలంగాణ-ములుగు
సమాజంలో తీవ్రమైన పరిణామాల్లోకి నెట్టి వేయబడిన వితంతువుల పక్షాన 'చెమటని' పుస్తకం నిలుస్తుందని ములుగు జిల్లా సంక్షేమ శాఖ అధికారి ప్రేమలత అన్నారు. కందుకూరి జయంతి సందర్భంగా జిల్లాలో శుక్రవారం ఏర్పాటుచేసిన వితంతువుల మహాసభ తోపాటు సంద బాబు సంపాదకత్వంలో వెలువడిన కవితా పుస్తకం పరిచయ సభ ఏర్పాటు చేశారు. అనంతరం వితంతు ఒంటరి మహిళా సమస్యల సాధన సంక్షేమ సంఘం డైరెక్టర్ సంద బాబు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాటాడారు. వితంతువుల పై ఉన్న వివక్షతను రూపుమాపడంతో పాటు, సమాజాన్ని చైతన్యపరచడం లో కవిత్వం కీలక భూమిక పోషిస్తుందని అన్నారు. అనాది కాలములోనే వితంతువుల పక్షాన నిలబడి పోరాడిన మహనీయుల కషి ఎనలేనిదని అన్నారు. వైవిద్యభరితమైన జీవితాన్ని అనుభవిస్తున్న వితంతువులకు ఆత్మస్థైర్యం కలిగిస్తే ముందుకు సాగుతూ స్వశక్తితో ఎదిగి ఉపాధికల్పన శక్తులుగా ఎదుగుతారని తెలిపారు. వితంతు, ఒంటరి మహిళలు హక్కులు, అధికారాలు, అవకాశాలను ఉపయోగించుకొని ఉన్నతంగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో రామప్ప సాహితీ వేదిక ములుగు జిల్లా అధ్యక్షుడు సముద్రాల శ్రీనివాసాచార్య, జయశంకర్ సారస్వత సమితి వ్యవస్థాపకులు గడ్డం లక్ష్మయ్య, తెలంగాణ సామాజిక రచయితల సంఘం ములుగు జిల్లా అధ్యక్షుడు కొండ్లే శ్రీనివాస్, జయశంకర్ జిల్లా అధ్యక్షుడు కొలుగూరి సంజీవరావు, జాగతి దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు రాయబారపు రమేష్, బాలవికాస వీడో ఎంపవర్మెంట్ ప్రోగ్రాం మేనేజర్ మంజుల, వితంతు ఒంటరి మహిళా సమస్యల సాధన సంక్షేమ సంఘం (ఓమ్స్) ములుగు జిల్లా అధ్యక్షురాలు ఎండీ అమీనా సుల్తానా, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలు తొట్ల వెంకటలక్ష్మి, కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలు కోటోజు జ్యోతిరాణి, కవులు, కళాకారులు, రచయితలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.