Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరేందర్
నవతెలంగాణ-జనగామ
కేరళ రాష్ట్రంలో నిన్న జరిగిన దారుణ హత్య ను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకుడు అభిమన్యుని ఆర్ఎస్ఎస్ గుండాలు ఆతి కిరాతకంగా దారుణ హత్య చేయడం సిగ్గుచేటని, ఆర్ఎస్ఎస్ గూండాలను కఠినంగా శిక్షించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బోడ నరేందర్ డిమాండ్ చేశారు. స్థానిక ఎస్ఎఫ్ఐ జనగామ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లా డారు. చిన్న వయసులోనే భగత్ సింగ్ స్ఫూర్తితో విద్యార్థి ఉద్యమాల్లో క్రియాశీలకంగా పోరాటం చేస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకుడిని దారుణంగా హత్య చేయడం పిరికిపంద చర్య అన్నారు. ధైర్యంగా మమ్ములను ఎదుర్కోలేకనే ఇలాంటి దారుణాలకు తెగబడుతున్నారని అన్నారు. ఎస్ఎఫ్ఐ ఉద్యమాలు ఆగవని, మరిన్ని ఉద్యమాలు చేస్తామని ఇలాంటి అభిమానుల కొన్ని వందల సంఖ్యలో వస్తారని అన్నారు. ఆర్ఎస్ఎస్ గుండాలు ప్రజాస్వామ్య బద్ధంగా ధైర్యంగా ప్రజా ఉద్యమాలు ఎదుర్కోవాలి అన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులు మతోన్మాదం పేరుతో ప్రజలను రెచ్చగొడు తున్నారని అన్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రజల పక్షాన నిలబడాలనుకుంటే ఇలాంటి దారుణాలు చేసేవాళ్ళు కాదన్నారు. ఆర్ఎస్ఎస్ గుండాల మీద కేసు నమోదు చేయాలని, విచారణ జరిపించి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు దడీగే సందీప్, నాయకులు దూసరి నాగరాజు, తేజావత్ గణేష్, కనకాచారి, ప్రవీణ్ రాకేష్, పాల్గొన్నారు.