Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బచ్చన్నపేట
ఆర్థిక ఇబ్బందులకు తాళలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని కేసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మామిడాల భాస్కర్ (35) కొద్ది రోజులుగా చికెన్ షాపు నిర్వహిస్తూ, కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులతో మనస్థాపానికి గురై వ్యవసాయ బావి వద్ద ఓ చెట్టుకు ఉరివేసుకున్నాడు. గమనించిన చుట్టు పక్కల రైతులు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. భార్య స్వప్న ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై లక్ష్మణరావు తెలిపారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని సర్పంచ్ దివ్య అరవింద్ రెడ్డి, ఎంపీటీసీ వేణుగోపాల్, కాపర్తి హరిప్రసాద్ కోరారు.