Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్
నవతెలంగాణ-మహబూబాబాద్
రెండు పడక గదుల ఇండ్లను త్వరితగతిన నిర్మించేందుకు ప్రణాళికబద్ధంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. శుక్రవారం మహబూ బాబాద్ మండలం గుమ్ముడూరు పరిధి రామచంద్రపురం కాలనీ వద్ద నిర్మిస్తున్న రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణాలను కలెక్టర్ అధికారులతో సందర్శించి పరిశీలించారు. బ్లాక్‌ల వారీగా చేపడుతున్న 160 డబుల్ బెడ్రూం ఇండ్ల పనులు త్వరితగతిన చేపట్టాలన్నారు. ఆ ప్రాంతంలోనే పూర్తవుతున్న 200 ఇండ్ల పనులు పూర్తి చేయాలన్నారు. పనులు నాణ్యతా పరంగా ఉండాలని, ఇసుక కొరత లేకుండా చేస్తామన్నారు. కలెక్టర్ వెంట రోడ్లు భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తానేశ్వర్, డీఈ ఈ రాజేందర్ తదితరులు ఉన్నారు.