Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హెడ్‌కానిస్టేబుల్, కానిస్టేబుల్‌ను చంపిన మావోయిస్టులు
నవతెలంగాణ-వరంగల్
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో బేజీ గ్రామంలో బేస్ క్యాంప్‌కు 300 మీటర్ల దూరంలో బైక్‌పై వెళ్తున్న ఒక హెడ్‌కానిస్టేబుల్, కానిస్టేబుల్‌ను కత్తులతో పొడిచి మావోయిస్టులు చంపారు. ఈ సంఘటన బేస్‌క్యాంప్‌కు 300 మీటర్ల దూరంలో జరిగింది. ఈ ఘటనకు మావోయిస్టు నేత హిడ్మా, దినేష్‌లు పాల్పడ్డారని సుక్మా జిల్లా ఎస్పి ప్రకటించారు. సుక్మా జిల్లాలోని చింతల్నార్-గొరెగొండ రహదారి పనుల్లో వినియోగిస్తున్న ఈ వాహనాలను దగ్ధం చేయడానికి మావోయిస్టులు విఫలయత్నం చేశారు. ఈ రోడ్డు పనులను చేయిస్తున్న వెక్తిమునశి భాస్కర్‌ను బాణాలు వేసి హతమార్చారు. ఈ సంఘటనలతో గోదావరి లోయ అటవీ ప్రాంతంలో అలజడి మొదలైంది.