Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గార్ల
తెలంగాణ ప్రభుత్వం గ్రామ పంచాయతీల్లో పటిష్ఠంగా అమలు చేస్తున్న అభివద్ధి పనుల్లో అలసత్వాన్ని సహించేదిలేదని జిల్లా అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ హెచ్చరించారు. మండల పరిధిలోని సత్యనారాయణ పురం,ముల్కనూరు, పెద్ద కిష్టాపురం పంచాయతీ లలో నర్సరీ లు,డంపింగ్ యార్డ్ పనులను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సత్యనారాయణ పురం పంచాయితీలో అభివీద్ది పనుల పట్ల అసహనం వ్యక్తం చేశారు. సర్పంచ్ రాందాస్, కార్యదరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పనులను వేగవంతం చేయకుంటే షోకాజ్ నోటిస్ లు జారీ చేయాలని ఎంపిడివోను ఆదేశించారు. ముల్కనూరు లో నర్సరీ పనుల పట్ల సంతప్తి వ్యక్తం చేశారు. అనంతరం స్థానిక పీహెచ్ సిలో కోవీడ్ వ్యాక్సిన్ ఇస్తున్న తీరును పరిశీలించి వైద్య అధికారిణి ప్రణవికు పలు సూచనలు చేశారు. పెద్ద కిష్టాపురం లో నర్సరీ లో ఎండిన మొక్కల స్దానం లో మరో మొక్కలను పెంచి తగిన జాగ్రత్తలు తీసుకో వాలని సూచించారు. రాంపురం గ్రామంలో నర్సరీ, డంపింగ్ యార్డ్ లను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. నర్సరీ ని పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు చేపట్టాలని సూచిం చారు. డంపింగ్ యార్డ్ ఉప యోగించలేదని సర్పంచ్ చెప్పుతున్న మాటలకు పొంతన లేదని నిర్వహణ రికార్డు లను పరిశీలించారు.
సర్పంచ్ కు షోకాజ్ నోటిస్ జారీ
సంవత్సర కాలంగా గ్రామ పంచాయతీ పరిధిలో నిర్మాణం చేపడుతున్న శ్మశాన వాటిక పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ సర్పంచ్ గుగులోత్ తారాబాయి కి షోకాజ్ నోటిస్ లు జారీ చేస్తున్నట్లు ప్రకటించారు. స్లాబ్ వరకు మాత్రమే నిర్మాణం చేసిన వైకుం ఠదామం పనులను చూసి సర్పంచ్, కాంట్రాక్ట ర్ల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్మశాన వాటిక పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. సంబంధిత అధికారులు ఎన్ని సార్లు చెప్పుతున్న పనులలో అలసత్యం వహిం చారని అసహనం వ్యక్తం చేశారు. మూడు రోజుల్లో ప్లాస్టింగ్ పనులు, వారం రోజుల్లో పూర్తి నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి రోజు జరుగుతున్న నిర్మాణ పనుల ఫోటో లను తనకు వాట్సప్ ద్వారా పంపించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ వెంట సర్పంచ్ లు వట్టం జానకి రాణి, ఎంపిడివో రవీంద్ర రావు,డిఇ అరవింద్ బాబు,ఎఇ కిషోర్,యంపివో కిశోర్ కుమార్, ఎపివో మధు,అభిలాష్, రామకష్ణ,క్రాంతి, కుమార్ తదితరులు ఉన్నారు.