Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి అజ్మీర చందూలాల్(66) గురువారం రాత్రి హైదరాబాద్ లో ప్రయివేట్ ఆస్పత్రిలో అనారోగ్యంతో మతి చెందాడు. గిరిజనుల హక్కుల సాధనకు, సమస్యల పరిష్కారానికి అలుపెరుగని పోరాటం చేసిన మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత అజ్మీరా చందూలాల్ ప్రస్థానం ముగిసింది. శుక్రవారం చందూలాల్ స్వగ్రామం ములుగు జిల్లా జగ్గన్నపేట శివారు గ్రామం సారంగపల్లిలో ఆయన అత్యక్రియలు అధికార లాంఛనాల మధ్య నిర్వహించారు. కలెక్టర్ ఎస్ కష్ణ ఆదిత్య, జెడ్పీ చైర్మెన్ కుసుమ జగదీశ్వర్ దగ్గరుండి అంత్యక్రియల ఏర్పాట్లు పూర్తి చేశారు. చందూలాల్ పెద్ద కుమారుడు డాక్టర్ అజ్మీరా ప్రహ్లాద్ చితికి నిప్పంటించారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రణాళిక సంఘం వైస్ చైర్మెన్ బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంపీ ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్, ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఇతర అధికారులు, నేతలు పాల్గొని అంతిమ వీడ్కోలు పలికారు. మంత్రి సత్యవతి రాథోడ్ కన్నీటి పర్యంతమయ్యారు. గిరిజన నాయకుడిని కోల్పోయామని, ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
చందూలాల్ ప్రస్థానం
చందులాల్ 1954 ఆగస్టు 17న వరంగల్ జిల్లా ములుగు మండలం జగ్గన్నపేట శివారు గ్రామం సారంగపల్లిలో మీటునాయక్, మీటుబారు దంపతులకు జన్మించాడు. భార్య శారదతో వివాహం జరిగింది. అతనికి ఒక కూతురు ముగ్గురు కుమారులు ఉన్నారు.
రాజకీయ జీవితం
1981-85లో సర్పంచ్‌గా ఎన్నికైన చందూలాల్ 1985-1989 లో ఎమ్మెల్యేగా విజయం సాధించి నాలుగు సంవత్సరాలకే ఏపీ శాసనసభలో టీడీపీ తరఫున 1989లో ఎన్టీఆర్ మంత్రి వర్గంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశారు. 1994 -1996 లో రెండోసారి ఎమ్మెల్యే గా విజయం సాధించి, 1996లో 11వ లోక్ సభ సభ్యులుగా వరంగల్ నియోజకవర్గం నుంచి ఎంపీగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రామసాయం సురేందర్‌రెడ్డిపై పోటీ చేసి విజయం సాధించారు. 1998లో రెండోసారి 12వ లోకసభకు పోటీ చేసి విజయం సాధించారు. తిరిగి 2014లో మూడోసారి ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ నుండి గెలిచి కెేసీిఆర్ ప్రభుత్వంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగారు. 1981-85 వరకు జగ్గన్నపేట గ్రామ సర్పంచ్‌గా, 1985-89,1994-96,2014-2019 రెండు పర్యాయాలు ఆంధ్రప్రదేశ్, ఒక పర్యాయం తెలంగాణ ఎమ్మెల్యేగా గెలిచారు. 1986-88,1994-96 తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, 11వ లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యాడు. షెడ్యూల్ కులాల షెడ్యూల్ తెగల కమిటీ చైర్మన్ గా, 1989లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా, 1996 లేబర్ అండ్ వెల్ఫేర్ సభ్యులుగా, 1998లో 12వ లోకసభ సభ్యులు గా ఎన్నికయ్యారు. 1999-2001 టీడీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులుగా, 2001-2003 నేషనల్ ట్రైకార్ డైరెక్టర్‌గా, 2003-2005లో ట్రైకార్ చైర్మన్‌గా పదవులు చేపట్టారు. 2005లో టీిఆర్‌ఎస్‌లో చేరారు 2006లో టీిఆర్‌ఎస్ పోలిట్ బ్యూరో సభ్యులుగా, 2014లో ములుగు ఎమ్మెల్యేగా టీిఆర్‌ఎస్ నుండి గెలిచి గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగారు.