Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరంగల్ అర్భన్‌లో 965 ఆక్టివ్ కేసులు
- ఎంజీఎంలో ఐదుగురు జూనియర్లకు కరోనా
- జనగామ జిల్లాలో 164 కేసులు
- ఎంపీ కవితకు కరోనా !
నవతెలంగాణ-వరంగల్
వరంగల్ అర్భన్ జిల్లాలో గురువారం వరకు 965 కోవిడ్ ఆక్టివ్ కేసులున్నాయి. ఒకవైపు కోవిడ్ వ్యాక్సిన్ ఇస్తున్నప్పటికీ మరోవైపు కోవిడ్ కేసులు పెరుగుతూనే వున్నాయి. జిల్లాలో గురువారం 133 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎంజీఎం ఆసుపత్రిలో కోవిడ్‌కు సంబంధించి 142 బెడ్స్‌లో పాజిటివ్ కేసులకు వైద్య చికిత్స అందుతుంది. జిల్లాలో కోవిడ్ 19 నివారణకు కోవిషీల్డ్, కోవాక్సిన్ వ్యాక్సిన్‌ను ప్రజలు తీసుకుంటూనే వున్నా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడం ఆందోళనకరంగా మారింది. గ్రేటర్ వరంగల్ నగరం పరిధిలో విలీన గ్రామాల్లో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కాజీపేటలోని కడిపికొండలో ఇటీవల 60-70 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఆ ప్రాంత వాసులు స్వయంగా లాక్డౌన్ ప్రకటించుకున్న విషయం విదితమే. ఇటీవల హసన్‌పర్తి, పైడిపల్లి ప్రాంతాల్లోనూ పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
వరంగల్ అర్భన్ జిల్లాలో కోవిడ్ పాజిటివ్ కేసులు గణనీయంగా పెరిగాయి. మొదటి విడతలో కంటే రెండో విడతో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండడంతో వైద్య, ఆరోగ్య శాఖాధికారులు, సిబ్బంది, అధికార యంత్రాంగం ఆందోళనకు గురవు తుంది. గురువారం జిల్లాలో 133 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దినదినం పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇటీవల హసన్‌పర్తిలో ఒక మహిళ కరోనాతో మృతిచెందింది. దీంతో హసన్‌పర్తి అర్భన్ హెల్త్ సెంటర్ పరిధిలో పలు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ సెంటర్లో కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను సగటున ప్రతిరోజు వంద మందికిపైగా తీసుకుంటున్నారు. శుక్రవారం దేశాయిపేటలోని అర్భన్ హెల్త్ సెంటర్లోనూ కోవిషీల్ట్ వ్యాక్సిన్‌ను తీసుకోవడానికి నగరవాసులు బారులుతీరి వున్నారు. గ్రేటర్ వరంగల్ నగరం పరిధిలో కేసుల సంఖ్య 3వ డివిజన్ పైడిపెల్లిలోనూ పెరుగుతుండడం గమనార్హం.
965 ఆక్టివ్ పాజిటివ్ కేసులు
ప్రస్తుతం జిల్లాలో 965 ఆక్టివ్ పాజిటివ్ కేసులు న్నాయి. వరంగల్ నగరంలో కాకుండా పల్లెల్లోనూ కోవిడ్ పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతు న్నాయి. గ్రేటర్ వరంగల్
నగరంలో విలీన గ్రామాల్లో పెద్ద సంఖ్యలో కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతుండడం గమనార్హం. కాజీపేటలోని కడిపికొండలో ఒక చావుకు వచ్చిన కోవిడ్ పాజిటివ్ వ్యక్తితో సుమారు 60-70 కేసులు నమోదవడంతో ఆ గ్రామంలో వారికివారే లాక్డౌన్ ప్రకటించుకున్న విషయం విదితమే. ఎంజిఎం ఆసుపత్రిలో పనిచేస్తున్న 5గురు జూనియర్ డాక్టర్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. వారంతా చికిత్స తీసుకుంటున్నారు.
ఎంజిఎం ఆసుపత్రిలో 142 బెడ్స్ భర్తీ
ఎంజిఎం ఆసుపత్రిలో మొత్తం 440 బెడ్స్ వుండగా, 142 బెడ్స్ కోవిడ్ పాజిటివ్‌లతో భర్తీ అయ్యాయి. వీరంతా ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. కోవిడ్ 19 వార్డులో 120 బెడ్లు, 'సారి' వార్డులో 22 బెడ్స్ భర్తీ అయ్యాయి.
అందుబాటులో మరో 9,800 డోసులు
వరంగల్ అర్భన్ జిల్లాకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ 85 వేల 800 డోసులు వచ్చాయి. కోవాక్సిన్ వ్యాక్సిన్ 26 వేల 900 డోసులు వచ్చాయి. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుంది. మరో 9,800 డోసులు ఇప్పటికీ అందుబాటులో వున్నాయి.
190 ప్రైవేటు ఆసుపత్రులలోనూ కోవిడ్ చికిత్స : జిల్లా వైద్య, ఆరోగ్యాధికారి డాక్టర్ కె. లలితాదేవి
జిల్లాలో ప్రస్తుతం కోవిడ్ చికిత్స అందిస్తున్న 14 ప్రైవేటు ఆసుపత్రులతోపాటు మరో 176 ప్రైవేటు ఆసుపత్రులలోనూ కోవిడ్ చికిత్సకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఎంజిఎం ఆసుపత్రిలో 440 పడకలు, ప్రైవేటు ఆసుపత్రులలో 395 పడకలున్నాయి. ఇప్పుడు తాజాగా 6,060 పడకలు అందుబాటులోకి వచ్చాయి.
జనగామ జిల్లాలో 164 కేసులు
జనగామ : జిల్లాలో శుక్రవారం సాయంత్రం వరకు 1524 మందికి కరోణా పరీక్షలు నర్వహించగా వారిలో 164 మంధికి కరోనా పాజిటీవ్‌గా నిర్థాణ అయింది. ఇప్పటి వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒకే రోజు ఇంత పెద్దఎత్తునా కేసులు బయిటపడలేదు. వైద్యాధికురు తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలో ఇప్పటివరకు 7913 మంది కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం జిల్లాలో 926 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జిల్లాలో అధికారులు కేవలం ప్రకటనలకు మాతీత్రమే పరిమితం అవుతున్నారు తప్ప క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకోవఢం లేదని ప్రజలు మండిపడుతున్నారు. ప్రజల రక్షణను దృష్టిలో పెట్టుకోని కరోనా వైరెస్‌ను అరికట్టెందుకు ప్రజలకు మరింత అవగాహణ కల్పించడం తోపాటు తగు వైద్య సహాయక చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.