Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎమ్మెల్సీ 'కొండా' మండిపాటు
నవతెలంగాణ-వరంగల్
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ఎబిసిడిలు కూడా రావని, అలాంటి వ్యక్తికి కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇవ్వడం పట్ల కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు మండి పడ్డారు. శుక్రవారం హన్మకొండలోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో 'కొండా' దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండా మురళి మాట్లాడుతూ మా మనుమరాలినే కూర్చో బెడితా, మా మనుమరాలు మాట్లాడినంత ఇంగ్లీషు కూడా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడలే డన్నారు. కడియం శ్రీహరికి ఏమైంది.., మంచి పంతులు, లెక్చరర్ అలాంటి వాళ్లకు మంత్రి పదవులు ఇవ్వకుండా కాళ్లు మొక్కేటోళ్లకు టిఆర్ఎస్లో మంత్రి పదవులు ఇస్తున్నారన్నారు.
షర్మిలా పార్టీలోకి పిలిచినా పోలేదు..
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కూతురు షర్మిల పార్టీ నుండి కాల్ వచ్చినా మేం వెళ్లలేదని కొండా మురళి స్పష్టం చేశారు. జగన్‌కు జైళ్లో వున్నప్పుడు ఎంతో చేశామని, జైలు నుండి బయటకు వచ్చాక కనీస మర్యాద కూడా మాకు లభించలేదన్నారు.
గెలుపు గుర్రాలకే టికెట్లు..
అమ్ముడుపోయే వాళ్లకు టికెట్లు ఇవ్వమని, గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామని కొండా మురళి స్పష్టం చేశారు. మీరందరూ ఇతర పార్టీలకు అమ్ముడుపోమని ప్రమాణాలు చేయాలన్నారు. గత ఎన్నికల్లో ఎంతో మందిని కార్పొరేటర్లుగా గెలిపించామని, ఒకరైతే నా కారులో కూర్చొని జీవితమంతా మీవద్దనే పడి వుంటానని చెప్పాడని, తరువాత మాకు ముఖం చాటేసిండన్నారు. మమ్మల్ని నమ్ముకొని పనిచేయాలని, కొంత డబ్బు మీరు పెట్టుకోండి, కొంత డబ్బు అప్పో, సప్పో చేసి అవరమైతే భూమి అమ్మైనా మీ గెలుపుకు కృషి చేస్తానన్నారు.
ఆర్ధిక స్థోమత వున్నవాళ్లకే టికెట్లు : మాజీ మంత్రి కొండా సురేఖ
ఆర్ధిక స్థోమత, అర్హత వున్న వాళ్లకే పార్టీ టికెట్లు ఇవ్వడం జరుగుతుందని వరంగల్ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి, మాజీ మంత్రి కొండా సురేఖ చెప్పారు. గతంలో కార్పొరేటర్లుగా గెలిపిస్తే మాతో వుండకుండా ముఖం చాటేశారన్నారు. ఎన్నికల్లో ఆర్ధిక బలమే ముఖ్యమైపోయిందని, అందుకే డబ్బు పెట్టేవాళ్లకే అవకాశాలు కల్పించాల్సి వస్తుందన్నారు. కొంత డబ్బు మేమిస్తామన్నారు.