Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
భూపాల పల్లి ఓసీ 2 నిర్వాసిత గ్రామాలైన ఫక్కీర్ గడ్డ, ఆకుదారి వాడ, రైతులకు సంబంధించిన భూములు, ఇండ్లు సర్వే పూర్తి చేసి వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని సింగరేణి అధికారులను భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర వెంకటరమణ రెడ్డి ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ గడ్డిగాని పల్లి, రైతులకు సంబం ధించిన నష్ట పరిహారం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ త్వరలోనే చెల్లించాలని కోరారు. ఈ సమీక్ష సమావేశంలో ఎస్వోటూ జీఎం విజరు ప్రసాద్, ఓసీ2 ప్రాజెక్టు ఆఫీసర్ జాన్ ఆనంద్, ఎస్టేట్ ఆఫీసర్లు, శివ, బబుల్ రాజ్, ఏరియా సర్వే ఆఫీసర్లతోపాటు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బుర్ర రమేష్, రైతులు కొళ రాజమల్లు, ఆముదాల రామ్ చందర్, బిమానపల్లి మహేందర్, సెగ్గం శంకర్ పాల్గొన్నారు.